English | Telugu

'టక్కర్'తో వింటేజ్ సిద్ధార్థ్ ని చూస్తాం!

'నువ్వొస్తానంటే నేనొద్దంటానా', 'బొమ్మరిల్లు' వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని స్థానాన్ని సంపాదించుకున్న చార్మింగ్ హీరో సిద్ధార్థ్ త్వరలో 'టక్కర్' అనే సినిమాతో సరికొత్తగా అలరించనున్నారు. ఈ చిత్రానికి కార్తీక్ జి. క్రిష్ దర్శకత్వం వహిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, పాషన్ స్టూడియోస్ తో కలిసి టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాలో దివ్యాంశ కౌశిక్ కథానాయికగా నటిస్తున్నారు. 2023, జూన్ 9న తెలుగు, తమిళ భాషల్లో భారీస్థాయిలో ఈ చిత్రం విడుదల కానుంది. మూవీ ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా చిత్ర బృందం హైదరాబాద్ లో ప్రెస్ మీట్ నిర్వహించింది.

ఈ సందర్భంగా హీరో సిద్దార్థ్ మాట్లాడుతూ... "నన్ను చాలామంది అడుగుతుంటారు మీరు కంప్లీట్ కమర్షియల్ సినిమా చెయ్యొచ్చు కదా అని, దానికి సమాధానమే ఈ సినిమా. ఇప్పటివరకు నన్ను ఒక లవర్ బాయ్ లా చూసారు. ఇప్పుడు నన్ను నేను కంప్లీట్ డిఫరెంట్ గా చూపించబోతున్నాను. ఈ సినిమాలో నన్ను దర్శకుడు కార్తీక్ చాలా కొత్తగా చూపించాడు. పూర్తి కమర్షియల్ సినిమాగా ఈ సినిమాను తెరకెక్కించాడు. యాక్షన్ అండ్ రొమాంటిక్ టచ్ తో ఈ లవ్ స్టోరీ నడుస్తుంది. ఈ ఆగస్టుకి హీరోగా 20 ఏళ్ల కెరియర్ ను పూర్తిచేసినట్టు అవుతుంది. ఇప్పటికీ నా చేతిలో ఓ అరడజను సినిమాలు ఉండటం ఆనందాన్ని కలిగిస్తోంది. మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుని మరీ ఈ సినిమాలో యాక్షన్ సీన్స్ చేశాను. 35 రోజుల పాటు యాక్షన్ సీన్స్ తీయడం జరిగింది. ఈ సినిమాలో దివ్యాన్ష పాత్ర చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఈ సినిమా ఒక యూనిక్ లవ్ స్టోరీ. ఈ జనరేషన్ కి ఈ లవ్ స్టోరీ తప్పకుండా కనెక్ట్ అవుతుంది" అన్నారు.

దర్శకుడు కార్తిక్ జి క్రిష్ మాట్లాడుతూ... "ఇప్పటివరకు సిద్దార్థ్ ను మీరు ఒక లవర్ బాయ్ గా చూసారు. సిద్దార్థ్ ఒక రగ్గడ్ లవర్ బాయ్ గా ఇందులో చూపించాను. ఈ సినిమా అన్ని సినిమాలలా కాకుండా, కొంచెం కొత్తగా ఉండబోతుంది. ఈ సినిమాలో లవ్ , కామెడీ, రొమాన్స్ అన్ని ఉంటాయి. ఇది న్యూ జనరేషన్ సినిమా అని చెప్పొచ్చు" అన్నారు.

సహనిర్మాత వివేక్ కూచిబొట్ల మాట్లాడుతూ... "ఈ సినిమా మంచి కంటెంట్, సిద్దార్థ్ గారు మంచి పెరఫార్మర్.. ఈ సినిమా సిద్దార్థ్ గారికి మళ్ళీ ఆ స్థాయి హిట్ అవుతుంది. డైరెక్టర్ గారు ఈ సినిమాను చాలా బాగా తీసారు. ఈ సినిమాతో మళ్ళీ మన పాత సిద్దార్థ్ గారిని చూస్తాం." అన్నారు.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.