English | Telugu

అంజలికి షాకిచ్చిన స్వాతి

ఈ యేడాది అంజ‌లి హీరోయిన్ గా వచ్చిన గీతాంజలి సినిమా అనుహ్యంగా విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్ కూడా సిద్ధ‌మ‌వుతోంది. ఈ సినిమాలో నటించే చాన్స్ స్వాతికి దక్కినట్లు సమాచారం. నిజానికి స్వాతికి అవకాశం దక్కింది అనే కన్నా, అంజలి మంచి చాన్స్ పొగొట్టుకుంది అనడం బెటర్. ఎందుకంటే ఈ చాన్స్ అంజలిదే. పారితోషికం దగ్గర ఆమె పట్టుపట్టడంతో దర్శకులు ఆమె స్థానంలో స్వాతిని తీసుకున్నారు. స్వాతి కూడా చలాకీ నటిగా ప్రూవ్ చేసుకుంది. డిఫరెంట్ పాత్రలు చేస్తూ, లైవ్ లో వుంటూ వస్తోంది. అందుకే స్వాతి బెస్ట్ ఆప్ష‌న్ అని చిత్ర‌బృందం భావిస్తోంది. త్వ‌ర‌లోనే ఈ చిత్రానికి సంబంధించిన మ‌రిన్ని వివ‌రాలు వెల్ల‌డ‌య్యే ఛాన్స్ ఉంది.​

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.