English | Telugu
సూర్య వాడివాసల్ అప్‌డేట్ ఇచ్చిన వెట్రిమారన్
Updated : Jun 27, 2023
వెట్రిమారన్ ఇచ్చిన అప్‌డేట్ చూసి సూర్య ఫ్యాన్స్ సూపర్ సర్‌ప్రైజ్ ఫీలవుతున్నారు. వాడివాసల్ గురించి అద్భుతమైన అప్‌డేట్ ఇచ్చారు హీరో సూర్య. రోబోట్ బుల్‌ని తయారు చేస్తున్నట్టు హింట్ ఇచ్చారు వెట్రిమారన్. జల్లికట్టు ఆధారంగా తెరకెక్కుతోంది వాడివాసల్. నేషనల్ అవార్డు విన్నింగ్ తమిళ్ యాక్టర్ సూర్య ఇందులో హీరోగా నటిస్తున్నారు. ప్యాండమిక్ తర్వాత ఈ సినిమాకు సంబంధించిన పనులు ఒక్కొక్కటిగా కొలిక్కి వస్తున్నాయి. ఈ సినిమా యానిమాట్రిక్స్ ని లండన్‌లో చేస్తున్నారు. సీయస్ చెల్లప్ప నవల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ స్టేజ్ లో ఉంది.
దీని గురించి వెట్రిమారన్ మాట్లాడుతూ ``ప్రస్తుతం వాడివాసల్ ప్రీ ప్రొడక్షన్ స్టేజ్‌లో ఉంది. లండన్‌లో టీమ్ యానిమాట్రిక్స్ మీద వర్క్ చేస్తున్నారు. చాలా వేగంగా పనులు జరుగుతున్నాయి. లైఫ్ లైక్ రోబోని తయారు చేస్తున్నాం. ఇందులో పోట్ల గిత్త ఎలా ఉంటుందో అలా ఉంటుంది రోబో. ఎడ్లను అణచే సందర్భాల్లో ఈ బుల్‌ని వాడాలని నిర్ణయించాం`` అని అన్నారు. వెట్రిమారన్ డైరక్ట్ చేస్తున్నవిడుదలై 2 సెట్స్ మీదుంది. విడుదలై 2 విడుదల కాగానే వాడివాసల్ సెట్స్ మీదకు వెళ్తుంది. జీవీ ప్రకాష్ రా ఫోక్ మ్యూజిక్ ఇచ్చారు. ఇప్పటికే, రెండు, మూడు పాటల ట్యూన్ల కంపోజింగ్ పూర్తయింది. రస్టిక్, నేటివ్ సాంగ్స్ ఉంటాయి ఈ సినిమాలో. ప్రస్తుతం సూర్య కంగువ సినిమాలో నటిస్తున్నారు. పది భాషల్లో విడుదల కానుంది కంగువ సినిమా.