English | Telugu

సూర్య ఏళాం అరివు లో హాలీవుడ్ విలన్

సూర్య హీరోగా నటిస్తున్న "ఏళాం అరివు" చిత్రంలో హాలీవుడ్ విలన్ నటిస్తున్నాడని విశ్వసనీయ వర్గాల ద్వారా అందిన సమాచారం. వివరాల్లోకి వెళితే మురుగదాసన్ దర్శకత్వంలో, "గజిని" ఫేం సూర్య హీరోగా, కమల్ హాసన్ కుమార్తె శృతి హాసన్ హీరోయిన్ గా, ఉదయనిధి మారన్ నిర్మిస్తున్న భారీ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం "ఏళాం అరివు".

ఈ చిత్రం కోసం హాలీవుడ్ విలన్ ని తమిళ తెరకు పరిచయం చేస్తున్నాడు దర్శకుడు మురుగదాస్. ఈ విలన్ పేరు "జాన్ టి గూయాన్". ఇతను హాలీవుడ్ లో "స్పైడర్ మ్యాన్ -2", "క్రాడల్ ది గ్రేవ్" వంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించాడు. ఇతను మార్షల్ ఆర్ట్స్ లో ఎక్స్ పర్ట్ అని సమాచారం.

ఈ "ఏళాం అరివు" చిత్రానికి హేరీస్ జైరాజ్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ చిత్రంలోని ఒక పాటను వెయ్యి మంది డ్యాన్సర్లతో చెన్నైలో బిజీగా ఉండే రామనాధం తెరువు (వీధి) లో చిత్రీకరించారు. మామూలుగా మురుగదాస్ సినిమా అంటే ఏదో ఒక ప్రత్యేకత ఆ సినిమాలో కచ్చితంగా ఉంటుంది. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ తో "గజిని" చిత్రం తీసిన తర్వాత తను తీస్తున్న ఈ "ఏళాం అరివు" చిత్రం మరింత విభిన్నంగా ఉండేలా మురుగదాస్ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు.

ఈ చిత్రం కోసం హీరో సూర్య కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడట. తన బాడీ లాంగ్వేజ్ దగ్గర నుండి తన గెటప్, డైలాగ్ మాడ్యులేషన్ వరకూ ఈ "ఏళాం అరివు" చిత్రం కోసం సూర్య చాలా మార్పులు చేర్పులు చేస్తున్నాడట.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.