English | Telugu

రవితేజ, త్రిష జంటగా చిక్ బమ్ చిక్

రవితేజ, త్రిష జంటగా "చిక్ బమ్ చిక్" అనే చిత్రం నిర్మించబడుతోందని సమాచారం. వివరాల్లోకి వెళితే మాస్ రాజా రవితేజ హీరోగా, అందాల త్రిష హీరోయిన్ గా "చిక్ బమ్ చిక్" అనే చిత్రం నిర్మించబడుతోందని విశ్వసనీయ వర్గాల ద్వారా అందిన సమాచారం. బాలీవుడ్ లో సూపర్ హిట్టయిన "బ్యాండ్ బాజా బారాత్" అనే చిత్రాన్ని తెలుగులో "చిక్ బమ్ చిక్" పేరుతో రీమేక్ చేస్తున్నారట.

బాలీవుడ్ లో "బ్యాండ్ బాజా బారాత్" చిత్రంలో రణవీర్ సింగ్ నటించిన పాత్రలో తెలుగులో మాస్ రాజా రవితేజ హీరోగా నటిస్తూండగా, అనుష్క శర్మ నటించిన పాత్రలో తెలుగులో త్రిష హీరోయిన్ గా నటిస్తూందట. బాలీవుడ్ లో నిర్మించబడిన "బ్యాండ్ బాజా బారాత్" చిత్రం పూర్తి వినోదభరిత చిత్రంగా ప్రేక్షకాదరణ పోందింది.

"బ్యాండ్ బాజా బారాత్" చిత్రంలో కొన్ని లిప్ లాక్ సీన్లు యువతను ఆకట్టుకున్నాయి. మరి తెలుగులో ఈ "చిక్ బమ్ చిక్" చిత్రంలో హీరో రవితేజతో హీరోయిన్ త్రిష లిప్ లాక్ సీన్లలో నటించటానికి అంగీకరిస్తుందా...? ఇటీవల విడుదలైన "తీన్ మార్" చిత్రంలో హీరో పవన్ కళ్యాణ్ తో త్రిష లిప్ లాక్ సీన్లలో హ్యాపీగా నటించింది కనుక "చిక్ బమ్ చిక్" చిత్రంలో కూడా రవితేజతో త్రిష లిప్ లాక్ సీన్లలో నటించేందుకు అంగీకరించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని సినీ పండితులంటున్నారు.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.