English | Telugu

సెన్సేషన్‌కి రెడీ అవుతున్న సూపర్‌స్టార్‌.. ‘వేట్టయాన్‌’కి గుడ్‌బై చెప్పిన తలైవా!

సూపర్‌స్టార్‌ రజినీకాంత్‌, టి.జె.జ్ఞానవేల్‌ కాంబినేషన్‌లో తలైవా 170గా తెరకెక్కుతున్న భారీ చిత్రం ‘వేట్టయాన్‌’. ఈ చిత్రంలోని తన పాత్రకు సంబంధించిన షూటింగ్‌ కంప్లీట్‌ చేశారు రజినీ. ఈ సందర్భంగా చిత్ర యూనిట్‌ రజినీకి గ్రాండ్‌గా వీడ్కోలు పలికింది. రూ.160 కోట్ల భారీ బడ్జెట్‌తో లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్నఈ చిత్రాన్ని ఈ ఏడాది అక్టోబర్‌లో రిలీజ్‌ చెయ్యాలని ప్లాన్‌ చేస్తున్నారు. రెగ్యులర్‌గా ఉండే రజినీ స్టైల్‌కి భిన్నంగా ఈ సినిమా ఉండబోతోందని, అలాంటి ఓ వైవిధ్యమైన కథతో సినిమా చేసేందుకు ఒప్పుకున్న రజినీకి థాంక్స్‌ అంటూ రానా చెప్పిన మాటలు సోషల్‌ మీడియాలో బాగా వైరల్‌ అయ్యాయి.

పాన్‌ ఇండియా మూవీగా తెరకెక్కిన ఈ సినిమాలో అన్ని భాషలకు చెందిన నటీనటులు ఉన్నారు. అమితాబ్‌ బచ్చన్‌, ఫాహద్‌ ఫాసిల్‌, రానా దగ్గుబాటి, దుసరా విజయ్‌.. అన్ని ఇండస్ట్రీలకు చెందిన టాప్‌ స్టార్స్‌ ఈ సినిమాలో నటిస్తుండడం ఒక విశేషంగా చెప్పుకోవచ్చు. ఇలాంటి ఓ మంచి సినిమాలో తాను కూడా భాగమైనందుకు ఎంతో సంతోషంగా ఉందని రానా అంటున్నాడు. ‘జైలర్‌’ చిత్రంతో సంచలనం సృష్టించిన రజినీకాంత్‌ ‘వేట్టయాన్‌’ చిత్రంతో ఎలాంటి సెన్సేషన్‌ క్రియేట్‌ చేస్తారో వేచి చూడాల్సిందే.

ఫస్ట్ డే రికార్డు కలెక్షన్స్.. పోస్టర్ రిలీజ్ చేసిన చిత్ర బృందం

సంక్రాంతికి  వెల్ కమ్ చెప్తు నవీన్ పొలిశెట్టి, మీనాక్షి చౌదరి నిన్న 'అనగనగ ఒక రాజు'(Anaganaga Oka Raju)తో సిల్వర్ స్క్రీన్ పై తమ సత్తా చాటడానికి అడుగుపెట్టారు. అగ్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్ మెంట్స్  అధినేత నాగవంశీ నిర్మాత కావడం ఈ చిత్రం స్పెషాలిటీ. నూతన దర్శకుడు మారి(Maari)దర్శకత్వంలో పూర్తి గ్రామీణ వాతావరణం నేపథ్యంలో తెరకెక్కగా, మార్నింగ్ షో నుంచే   పాజిటివ్ టాక్  తో దూసుకుపోతుంది.  దీంతో సంక్రాంతి పందెంలో ఈ చిత్రం సాధించే కలెక్షన్స్ పై అందరిలో ఆసక్తి నెలకొని ఉండగా, చిత్ర బృందం మొదటి రోజు కలెక్షన్స్ ని అధికారకంగా ప్రకటించింది.