English | Telugu

పోటుగాడి పక్కన సంప్రదాయంగా సన్నీలియోన్

అసలే పోర్న్ స్టార్... ఆ తర్వాత బిగ్ బాస్ లో ఎంట్రీ ఇచ్చి బాగా పాపులారిటీ సొంతం చేసుకుంది. పూజాభట్, ఏక్తా కపూర్ లతో జతకట్టి సినిమాల్లో నటించేసింది సన్నీలియోన్. ఆమె కాలు కదిపినా, వేలు మీటినా మీడియాలో సంచలనమే. బాలీవుడ్‌లో "రాగిణి ఎం.ఎం.ఎస్ 2" చిత్రంతో బాక్సాఫీసు రికార్డులను బద్దలుకొట్టిన సన్నీలియోన్.. ఇటీవల "వడాకర్రీ" అనే తమిళ చిత్రం ఐటెం సాంగ్‌లో మెరిసింది.
ఈ సెక్సీ స్టార్ బోల్డ్ లుక్స్ లో మాత్రమే చూసిన అభిమానులకు ఇప్పుటు కొత్త గెటప్ లో కనిపించబోతోంది.

మంచు మనోజ్ నటిస్తున్న "కరెంట్ తీగ" చిత్రంలో సన్నీలియోన్ చాలా సాంప్రదాయబద్ధంగా.. నిండైన చీరలో కనిపించనుందని చిత్ర యూనిట్ అంటోంది.
రాకింగ్ స్టార్ మంచు మనోజ్.. త్వరలో "కరెంట్ తీగ" చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. "దేనికైనా రెడీ"తో సూపర్ సక్సెస్ అందుకొన్న జి.నాగేశ్వర రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకం పై మంచు విష్ణు నిర్మిస్తున్నారు.

సన్నీ, చీరలో, సాంప్రదాయబద్దంగా, అసలు వినడానికి కొత్తగా ఉన్న ఈ కాంబీనేషన్ స్క్రీన్ మీద ఎలా వర్క అవుట్ అవుతుంతో, అభిమానులకు ఇది ఎంత వరకు ఆసక్తిని కలిగిస్తుందో చూడాలి.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.