English | Telugu

తాను చదివిన స్కూల్‌కి వెళ్ళి ఎంటర్టైన్ చేసిన సుమ

యాంకర్ సుమ ఎక్కడ ఉంటే అక్కడ అల్లరి అల్లరి ఉంటుంది. ఇప్పుడు తాను చదివిన సెంట్ యాన్స్ హైస్కూల్ కి ఒక ఈవెంట్ కోసం చీఫ్ గెస్ట్ గా వెళ్ళింది. అక్కడికి వెళ్లి స్టేజి మీద పిల్లలకు ప్రైజెస్ అందించింది. టీచర్స్ తో మాట్లాడింది. "ఇక్కడికి రావడం వల్ల నా పాత రోజులు మళ్ళీ గుర్తొచ్చాయి. అందరికి నేను ప్రైజెస్, షీల్డ్స్ ఇస్తుంటే నాకు ఏడుపు వస్తోంది. నేను ఇక్కడ చదువుకున్న రోజుల్లో ఎప్పుడూ ఆల్ రౌండర్ గా, బెస్ట్ స్టూడెంట్, బెస్ట్ డిసిప్లిన్, బెస్ట్ సర్వీస్ ఇలాంటి ఎందులో కూడా నాకు ప్రైజ్ కానీ, షీల్డ్ కానీ రాలేదు. కానీ ఎవరైనా ప్రైజ్ గెలుచుకున్నప్పుడు మనం పడే సంతోషం మాత్రం ఈరోజు ఇక్కడ నేను ఫీలయ్యాను.

నేను ఆడుకున్న గ్రౌండ్, ఈ స్కూల్ రూమ్ చూసినప్పుడు నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అప్పట్లో నేను ఫకీర్ బాబాగా, సోది చెప్పే అమ్మాయిగా ఫాన్సీ డ్రెస్ కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేసాను. అప్పుడు సోది చెప్పే అమ్మాయి క్యారెక్టర్ ఈరోజు లైఫ్ లో ఇలా సోది అవుతుందని నేను ఎప్పుడూ అనుకోలేదు. నేను చదువుకున్న స్కూల్ లో ఇలా ఇప్పుడు మీ అందరి ముందు గెస్ట్ గా నిలబడడం అనేది నా గ్రేటెస్ట్ అచీవ్మెంట్ అనుకుంటాను. దానికి కర్త, కర్మ, క్రియ మా అమ్మ. ఈ స్కూల్ లో నా సెకండ్ లాంగ్వేజ్ తెలుగు. నేను మలయాళీ ఐనా కూడా మా అమ్మ ఓవర్ డెడికేషన్, డిసిప్లిన్ వల్ల నేను అప్పట్లో కష్టపడి తెలుగు నేర్చుకోవాల్సి వచ్చింది. కాబట్టే ఈరోజు ఎలాంటి స్క్రిప్ట్ ఇచ్చినా అలా చదివేసుకోగలుగుతున్నాను." అని చెప్పింది. తర్వాత ఆ స్కూల్ స్టాఫ్ అంతా కలిసి సుమకు ఒక మొమెంటో ఇచ్చి సత్కరించారు. "నేను చదివిన స్కూల్ కి వచ్చి నా ప్లే గ్రౌండ్, నా క్లాస్ రూమ్స్, నా అసెంబ్లీ ప్లేస్, నా స్టేజి అన్నిటినీ ఈరోజు రీవిజిట్ చేసాను. ఇది చెప్పాలంటే నాకు చాలా ఎమోషనల్ ఫీలింగ్ ఇచ్చింది." అని చెప్పింది సుమ.