English | Telugu

వర్షంలో బైక్ నెట్టుకుంటు కథ రాసాను.. ఓజి సుజిత్ కీలక వ్యాఖ్యలు

'ఓజి'(OG)తో ఇప్పుడు పాన్ ఇండియా లెవల్లో 'సుజీత్'(Sujeeth)పేరు మారుమోగిపోతుంది. విభిన్నమైన స్క్రీన్ ప్లేకి తోడు, స్టైలిస్ట్ మేకింగ్ తో కథని తెరకెక్కించడం సుజీత్ స్టైల్. ప్రభాస్ తో తెరకెక్కించిన తన గత చిత్రం 'సాహో'నే ఒక ఉదాహరణ. 2019 లో వచ్చిన ఈ మూవీతో బాలీవుడ్ లో కూడా మంచి అదరణని చూరగొన్నాడు. ఈ నేపథ్యంలో ఐదు సంవత్సరాల తర్వాత 'ఓజి' తో వస్తుండటం, పైగా పవన్ కళ్యాణ్ కి అభిమాని కూడా కావడంతో 'ఓజి' ని ఎంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించాడో అర్ధం చేసుకోవచ్చు.

రీసెంట్ గా సుజీత్ ఒక ఇంటర్వ్యూ లో తన కెరీర్ కి సంబంధించిన తొలి నాటి విషయాలని గుర్తు చేసుకున్నాడు. ఆయన మాట్లాడుతు తొలి చిత్రం ప్రేమకథ అయితే భావించి, కథ రాసుకొని అవకాశాల కోసం తిరిగాను. రన్ రాజా కంటే ముందు నిర్మాతలకి వినిపించడంతో . ఫస్ట్ హాఫ్ వాళ్ళకి నచ్చింది. సెకండ్ హాఫ్ కోసం ఐదు నెలల పాటు రేయింపగళ్ళు కష్టపడ్డాను. పూర్తి స్క్రిప్ట్ వాళ్ళకి నచ్చడంతో, మూవీ ఒకే అయ్యిందని హ్యాపీగా ఫీలయ్యి, ఆ సంతోషంలో బైక్ పై ఇంటికి బయలు దేరాను. కానీ నిర్మాతలు ఫోన్ చేసి కథకి ఎక్కువ బడ్జెట్ అయ్యేలా ఉంది. వేరే కథ ఉంటే చెప్పమన్నారు. దాంతో షాక్ అయ్యాను. అప్పుడే పెద్ద ఎత్తున వర్షం స్టార్ట్ అయ్యింది. రోడ్ పక్కనే కూర్చుని మూడు గంటల పాటలు ఏడ్చాను. ఆ టైంలో వెన్నెల కిషోర్ కి ఫోన్ చేస్తే, నువ్వు షార్ట్ ఫిలిం గంటలో రాయగలవు. సినిమా ఒక రోజులో రాయలేవా అని ధైర్యాన్ని ఇచ్చాడు.

ఆ ఉత్సాహంతో ఇంటికి వెళదామని అనుకుంటే బైక్ లో పెట్రోల్ అయిపోయింది. జేబులో డబ్బులు లేకపోవడంతో, వర్షంలోనే జూబ్లీహిల్స్ నుంచి ముషీరాబాద్ వరకు తోసుకుంటు వచ్చాను. ఆ టైంలో ఏర్పడిన కసితోనే 'రన్ రాజా రన్'(Run Raja Run)కథ రాసుకొని ఓకే చేయించుకున్నానని సుజీత్ చెప్పుకొచ్చాడు. రన్ రాజా రన్ 2014 లో ప్రేక్షకుల ముందుకు రాగా, శర్వానంద్, సీరత్ కపూర్ జంటగా నటించారు. యువి క్రియేషన్స్ నిర్మించగా, రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కి మంచి విజయాన్ని అందుకుంది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.