English | Telugu

జాక్వలిన్ కి షాక్ ఇచ్చిన సుప్రీంకోర్ట్.. సుజిత్ సాహో గుర్తుంది కదా!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas),సుజిత్(Sujeeth)కాంబినేషన్ లో వచ్చిన 'సాహూ'లోని 'బ్యాడ్ బాయ్' స్పెషల్ సాంగ్ తో ఫ్యాన్స్ ని మెస్మరైజ్ చేసిన నటి 'జాక్వలిన్ ఫెర్నాండేజ్'(Jacqueline Fernandez).హిందీలో సల్మాన్ తో పాటు పలువురు హీరోల చిత్రాల్లో నటించిన జాక్వలిన్, ఆర్ధిక నేరస్తుడిగా ప్రస్తుతం జైల్లో ఉన్న సుఖేష్ చంద్రశేఖర్ తో ప్రేమలో ఉన్నట్టుగా వార్తలు వచ్చాయి. అందుకు తగ్గట్టే సోషల్ మీడియాలో ఆ ఇద్దరు కలిసి ఉన్న పిక్స్ సంచలనం సృష్టించాయి.

సుఖేష్ పలు మార్గాల ద్వారా కొంత మంది ప్రముఖుల్ని మోసగించి, సుమారు 200 కోట్ల రూపాయిల వరకు వసూలు చేసాడు. దీంతో మనీ లాండరింగ్ కింద ఈడి కేసు నమోదు చేసి అరెస్ట్ చెయ్యడంతో ప్రస్తుతం జైల్లో ఉన్నాడు. సుఖేష్ తాను దోపిడీ చేసిన డబ్బు నుంచి జాక్వలిన్ కి ఖరీదైన డిజైన్ బ్యాగ్ లు,వజ్రాల చెవి పోగులతో పాటు ఇతర విలువైన వస్తువులు ఇచ్చాడు.ఈ విషయాన్నీ ఈడీ అధికారులు తమ దర్యాప్తులో గుర్తించారు.వాటి విలువ సుమారు పది కోట్ల రూపాయల వరకు ఉంటుంది. సుఖేష్ ఆర్ధిక నేరగాడు అని తెలిసే జాక్వలిన్ అతనితో ప్రేమాయణం నడిపిందని కూడా ఈడీ గుర్తించడంతో, ఆమెపై కేసు నమోదు చేసారు. దీంతో కేసుని కొట్టివెయ్యాలంటూ సుప్రీంకోర్ట్ లో ఆమె పిటిషన్ వేసింది. ఈ పిటిషన్ పై సుదీర్ఘ విచారణ జరిపిన సుప్రీంకోర్టు(Supreem Court)ఈ రోజు మరోసారి విచారణ జరిపి, జాక్వలిన్ పిటిషన్ ని కొట్టి వేసింది. ఈ తీర్పు జాక్వలిన్ కి షాకింగ్ అని చెప్పవచ్చు. 2023 నుంచి జరుగుతున్న ఈ కేసుకి సంబంధించి జాక్వలిన్ ఒకసారి కోర్ట్ కి హాజరయ్యింది.


శ్రీలంక దేశానికి చెందిన జాక్వలిన్, 2009 లో సినీ రంగ ప్రవేశం చేసి, ఇప్పటి వరకు సుమారు ముప్పై కి పైగా చిత్రాల్లో చేసింది. ఈ ఏడాది రెయిడ్ పార్ట్ 2 , హౌస్ ఫుల్ 5 వంటి చిత్రాల్లో కనిపించగా,వెల్ కమ్ టూ ది జంగల్ విడుదలకి సిద్ధంగా ఉంది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.