English | Telugu

'అవతార్'ని మించేలా 'SSMB29'.. ఏం ప్లాన్ చేశావయ్యా జక్కన్న..!

'బాహుబలి', 'ఆర్ఆర్ఆర్' సినిమాలతో అంతర్జాతీయ గుర్తింపు పొందిన దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి(SS Rajamouli).. తన తదుపరి చిత్రాన్ని సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu)తో చేస్తున్నారు. మహేష్ కెరీర్ లో 29వ సినిమాగా రూపొందుతోన్న ఈ ప్రాజెక్ట్ కి 'SSMB29' అనేది వర్కింగ్ టైటిల్. కె.ఎల్. నారాయణ అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ లో ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రంతో హాలీవుడ్ సినిమాలను సవాల్ చేసే స్థాయికి రాజమౌళి ఎదుగుతారని అందరూ బలంగా నమ్ముతున్నారు. అందుకు తగ్గట్టుగానే 'SSMB29'కి సంబంధించిన ఒక్కో అప్డేట్ సినిమాపై అంచనాలను రెట్టింపు చేస్తోంది.

'బాహుబలి'తో పాన్ ఇండియా ట్రెండ్ కి శ్రీకారం చుట్టిన రాజమౌళి.. 'SSMB29'తో పాన్ వరల్డ్ ట్రెండ్ కి శ్రీకారం చుట్టబోతున్నారు. ఈ క్రమంలోనే 'SSMB29' చిత్రాన్ని ఏకంగా 120 దేశాల్లో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ విషయాన్ని కెన్యా క్యాబినెట్ సెక్రటరీ ముసలియా ముదవాడి(Musalia Mudavadi) రివీల్ చేయడం విశేషం.

'SSMB29' చిత్రం ఆఫ్రికా అడవుల నేపథ్యంలో తెరకెక్కనుంది. ఈ మూవీ షూటింగ్ ఎక్కువభాగం కెన్యాలో జరగనుంది. ఈ క్రమంలోనే రీసెంట్ గా చిత్ర నిర్మాత కె.ఎల్. నారాయణ, కుమారుడు కార్తికేయతో కలిసి.. కెన్యాలో ముసలియా ముదవాడితో సమావేశమయ్యారు రాజమౌళి. ఈ మీటింగ్ కి సంబంధించిన ఫొటోలను తాజాగా సోషల్ మీడియాలో పంచుకున్న కెన్యా క్యాబినెట్ సెక్రటరీ.. తమ దేశంలో 'SSMB29' షూటింగ్ జరగనుండటంపై సంతోషం వ్యక్తం చేశారు. ప్రపంచంలోని గొప్ప ఫిల్మ్ మేకర్స్ లో ఒకరైన రాజమౌళి రూపొందిస్తున్న సినిమా తమ దేశంలో షూటింగ్ జరుపుకోవడం ఆనందంగా ఉందని తెలిపారు. 120కి పైగా దేశాలలో విడుదల కానున్న ఈ చిత్రం.. ప్రపంచవ్యాప్తంగా ఒక బిలియన్ కంటే ఎక్కువ మంది ప్రేక్షకులను చేరువ అవుతుందని అన్నారు. ఈ సినిమా ద్వారా కెన్యా దేశం యొక్క అందం, ఆతిథ్యం ప్రపంచానికి తెలుస్తుందని ముసలియా ముదవాడి రాసుకొచ్చారు.

'SSMB29' మూవీ120కి పైగా దేశాలలో విడుదల కానుందన్న న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాని షేక్ చేస్తోంది. భారీ హాలీవుడ్ సినిమాలే వంద లోపు దేశాలలో విడుదలవుతుంటాయి. 'అవతార్' లాంటి సినిమా కూడా 80 లోపు దేశాల్లోనే విడుదలైంది. అలాంటిది, 'SSMB29' మూవీ ఏకంగా 120 దేశాల్లో విడుదల కానుందన్న వార్త సంచలనంగా మారింది. ఈ చిత్రంతో ప్రపంచ సినిమాపై రాజమౌళి బలమైన ముద్ర వేసేలా ఉన్నారు.

కాగా, 'SSMB29' ఫస్ట్ లుక్ నవంబర్ లో విడుదల కానుంది. అసలు ఈ సినిమా ఎలా ఉంటుంది? ఇందులో మహేష్ లుక్ ఎలా ఉంటుంది? అనే సస్పెన్స్ కి ఫస్ట్ లుక్ తో తెరపడనుంది.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.