English | Telugu
రియల్ స్టార్ "ముద్ర"లో ఆర్తి
Updated : Feb 8, 2011
ప్రముఖ కొరియోగ్రాఫర్ కమ్ డైరెక్టర్ అమ్మ రాజశేఖర్ దర్శకత్వంలో రాబోయే "ముద్ర"చిత్రంలో రియల్ స్టార్ శ్రీహరి హీరోగా నటిస్తున్నారు.ఈ చిత్రంలో అమ్మరాజశేఖర్ కూడా ఒక ముఖ్య పాత్రను పోషిస్తున్నాడు.అతని సరసన ఒకప్పటి ప్రముఖ హీరోయిన్ ఆర్తి అగర్వాల్ జోడీగా నటిస్తూంది.
ఒకప్పుడు చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ , తరుణ్, ఉదయకిరణ్ వంటి స్టార్స్ తో నటించిన ఆర్తి అగర్వాల్ ప్రస్తుతం అమ్మ రాజశేఖర్ సరసన నటించటం చూస్తుంటే జాలేస్తోంది. దీనికి కారణం ఆమె చేసుకున్న స్వయం కృతాపరాధమే.ఒకప్పుడు తరుణ్ తో ప్రేమ వ్యవహారం, ఆ తర్వాత ఆత్మహత్యా ప్రయత్నం వంటి విషయాలన్నీ నేటి ఆమె ఈ పరిస్థితికి కారణాలుగా అనుకోవచ్చు. అందుకే అంటారు ఓడలు బళ్ళు, బళ్ళు ఓడలు అవుతాయని.