English | Telugu

‘స్కంద’ 2 గంట‌ల 47 నిమిషాలు!

ఎన‌ర్జిటిక్‌స్టార్ రామ్ పోతినేని క‌థానాయ‌కుడిగా న‌టించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ ‘స్కంద’ మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీను ఈ సినిమాను తెర‌కెక్కించారు. వీరిద్ద‌రి కాంబోలో వ‌స్తోన్న తొలి సినిమానే కాదు.. ఇద్ద‌రికీ తొలి పాన్ ఇండియా సినిమా కూడా. బోయ‌పాటి త‌న‌దైన స్టైల్లో మాస్ అండ్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా దీన్ని తెర‌కెక్కించారు. ముందుగా సెప్టెంబ‌ర్ 15న రిలీజ్ చేయాల‌ని భావించారు. కానీ ఇప్పుడు సెప్టెంబ‌ర్ 28న రిలీజ్ చేస్తున్నారు. స‌లార్ మూవీ వాయిదా ప‌డుతుండ‌ట‌మే ఇందుకు కార‌ణ‌మ‌ని సినీ స‌ర్కిల్స్ టాక్‌.

రామ్ స‌ర‌స‌న శ్రీలీల హీరోయిన్‌గా న‌టిస్తోన్న ఈ మూవీలో బాలీవుడ్ స్టార్ స‌యీ మంజ్రేక‌ర్ కీల‌క పాత్ర‌లో న‌టిస్తోంది. ఈ సినిమా సెన్సార్ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకుంది. యు/ఎ స‌ర్టిఫికేట్ ఇచ్చారు. 2 గంట‌ల 47 నిమిషాల ర‌న్ టైమ్‌ను ఫిక్స్ చేశారు. అఖండ వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ త‌ర్వాత బోయ‌పాటి శ్రీను తెర‌కెక్కించిన సినిమా ఇది. అంచ‌నాలు భారీగానే ఉన్నాయి. మ‌రో వైపు రామ్ సైతం సాలిడ్ స‌క్సెస్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమా హిట్ అయితే రామ్ కాస్త ఊపిరి పీల్చుకుంటాడ‌న‌టంలో సందేహం లేదు. అదీగాక త‌న మార్కెట్ కూడా పెరుగుతుంది.

ఇది వ‌ర‌కు రామ్‌ను ఇత‌ర ద‌ర్శ‌కులు చూపించిన తీరుకి బోయ‌పాటి శ్రీను చూపించ‌బోయే స్టైల్ పూర్తి భిన్నంగా ఉంది. అది ట్రైల‌ర్‌లో స్ప‌ష్ట‌మ‌వుతుంది. ఇక మేక‌ర్స్ ప్ర‌మోష‌న‌ల్ యాక్టివిటీస్‌లో బిజీ కాబోతున్నారు. లాంగ్ వీకెండ్ కావ‌టంతో సినిమాకు బాగానే క‌లిసొస్తుంద‌ని ట్రేడ్ వ‌ర్గాలు భావిస్తున్నారు. జీస్టూడియోస్‌, శ్రీనివాస్ సిల్వ‌ర్ స్క్రీన్స్ బ్యాన‌ర్స్‌పై శ్రీనివాసా చిట్టూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మ‌రోవైపు పూరి జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో రామ్ హీరోగా డబుల్ ఇస్మార్ సినిమా రూపొందుతోన్న సంగ‌తి తెలిసిందే. ఇందులో సంజ‌య్ ద‌త్ విల‌న్‌గా న‌టిస్తున్నారు.