English | Telugu

హిందీ బ్లాక్ బస్టర్ వెబ్ సిరీస్ తెలుగులోకి రీమేక్..హీరో ఎవరో తెలిస్తే షాక్ అవుతారు 

2020 లో హిందీ సినీ ప్రేమికులని విశేషంగా అలరించిన వెబ్ సిరీస్ లో 'పంచాయత్' (Panchayath) కూడా ఒకటి. కామెడీ డ్రామాగా తెరకెక్కిన ఈ సిరీస్ ప్రేక్షకులని నవ్వుల జడివానలో ముంచింది. మూడు సీజన్ల గా విడుదలయిన ఈ సిరీస్ కి దీపక్ మిశ్రా దర్శకత్వాన్ని వహించగా 'ది వైరల్ ఫీవర్'సంస్థ నిర్మించింది. జితేంద్ర కుమార్,నీనా గుప్తా,రఘుబీర్ యాదవ్,చందన్ రాయ్ ముఖ్య పాత్రలు పోషించారు.

ఇప్పుడు ఈ సిరీస్ 'సివరపల్లి' (Sivarapalli) అనే పేరుతో తెలుగులోకి రీమేక్ అయ్యింది. అమెజాన్ ప్రైమ్ వేదికగా ఈ నెల 24 నుంచి స్ట్రీమింగ్ కానుండగా రాగ్ మయూర్ (Rag Mayur), బలగం (Balagam) ఫేమ్ మురళి గౌడ్ (Murali goud), రూపలక్ష్మి ముఖ్య పాత్రల్లో కనిపిస్తున్నారు. భాస్కర్ మౌర్య (Bhaskar mourya) దర్శకత్వాన్ని వహించగా విజయ్ కోషే, శ్రేయాన్స్ పాండే లు నిర్మాతలుగా వ్యవహరించడం జరిగింది. శ్యామ్ అనే యువకుడు తెలంగాణలోని ఒక మారుమూలపల్లెలో ఉధ్యోగం చేయాల్సి వస్తుంది. నిజాయితీగా ఉద్యోగం చెయ్యాలనుకున్న శ్యామ్ కి ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయనే కాన్సెప్ట్ తో ఈ సిరీస్ తెరకెక్కింది. తమిళ నాట ఇప్పటికే రీమేక్ అయ్యి భారీ విజయాన్ని అందుకుంది.


Dominic And The Ladies Purse Review: డొమినిక్ అండ్ ద లేడీస్ పర్స్ మూవీ రివ్యూ

సి.ఐ డొమినిక్ (మమ్ముట్టి) ప్రైవేట్ డిటెక్టివ్ గా చేస్తుంటాడు. అతడు గతంలో పోలీస్ ఆఫీసర్. ఇక అతనికి సహాయంగా ఉండేందుకు ఒక వ్యక్తి కావాలంటూ డొమినిక్ పేపర్ లో ప్రకటన ఇస్తాడు. దాంతో విక్కీ (గోకుల్ సురేశ్) అతడికి అసిస్టెంట్ గా  జాయిన్ అవుతాడు. ఒకరోజు డొమినిక్ ఉండే ఇంటి ఓనర్ మాధురి (విజీ వెంకటేశ్) అతని దగ్గరికి వచ్చి.. తను జనరల్ హాస్పిటల్ కి వెళ్లినప్పుడు ఒక 'పర్స్' దొరికిందని చెప్పి ఇస్తుంది. ఆ పర్స్ ఎవరిదో తెలుసుకుని వాళ్లకి అందజేయమని చెప్తుంది. దాంతో ఆ పర్స్ ఎవరిదో తెలుసుకునే పనిలో పడతాడు డొమినిక్. ఆ పర్స్ పూజ (మీనాక్షి ఉన్నికృష్ణన్) అనే యువతికి చెందినదని తెలుసుకుంటాడు. అయితే ఆ పర్స్ పారేసుకున్న రోజు నుంచి ఆమె మిస్సింగ్ అని తెలిసి షాక్ అవుతాడు...