English | Telugu

క్లాస్‌ని పక్కన పెట్టి మాస్‌ని టార్గెట్‌ చేస్తున్న శివ నిర్వాణ.. హీరో ఎవరో తెలుసా?

కొందరు డైరెక్టర్లు కొన్ని జోనర్స్‌కి మాత్రమే పరిమితమై ఉంటారు. వారు ఎప్పుడు సినిమా చేసినా అదే జోనర్‌లో హిట్‌ కొట్టేందుకు ట్రై చేస్తుంటారు. కొన్నిసార్లు వాళ్ల జోనర్‌ని పక్కన పెట్టి వేరే జోనర్‌లో సినిమా చెయ్యాలని ప్రయత్నిస్తారు. అయితే అది బెడిసి కొడుతుంది. దాసరి నారాయణరావు, కె.రాఘవేంద్రరావు, కోడి రామకృష్ణ వంటి డైరెక్టర్లు అన్ని జోనర్స్‌లో సినిమాలు చేసి విజయం సాధించారు. ఆ తర్వాత వచ్చిన డైరెక్టర్లు మాత్రం వాళ్ళకంటూ ఒక మార్క్‌ని క్రియేట్‌ చేసుకొని అందులోనే సినిమాలు చేస్తున్నారు. అలా వచ్చిన డైరెక్టరే శివ నిర్వాణ.

నాని, నివేదా థామస్‌, ఆది పినిశెట్టి ప్రధాన పాత్రల్లో శివ చేసిన ‘నిన్నుకోరి’ చిత్రం మంచి విజయం సాధించింది. ఎమోషనల్‌ లవ్‌స్టోరీ, పెళ్లి, త్యాగం వంటి ఎమోషన్స్‌తో సినిమా అద్భుతంగా నడిచింది. ఆ తర్వాత నాగచైతన్య, సమంతలతో చేసిన ‘మజిలీ’ చిత్రంలో ఫ్యామిలీ ఎమోషన్స్‌తోపాటు ప్రేమ పూరిత సన్నివేశాలు కూడా వర్కవుట్‌ అవ్వడంతో ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్‌ వచ్చింది. ఈ రెండు సినిమాలను బట్టి శివ నిర్వాణ ఆ తరహా సినిమాలను బాగా డీల్‌ చెయ్యగలడని అర్థమవుతుంది. ఆ తర్వాత నానితో చేసిన ‘టక్‌ జగదీష్‌’ చిత్రంలోని కాన్సెప్ట్‌ కొత్తగా అనిపించినప్పటికీ సినిమాలోని కొన్ని సన్నివేశాలు, స్క్రీన్‌ప్లే రొటీన్‌ అనిపించడం వల్ల ఫ్లాప్‌ అయింది.

విజయ్‌ దేవరకొండ, సమంతలతో ఫీల్‌గుడ్‌ లవ్‌స్టోరీగా చేసిన ‘ఖుషి’ చిత్రంలో ఆ ఫీల్‌ మిస్‌ అవ్వడంతో సినిమా ఆశించిన స్థాయిలో నడవలేదు. వరసగా రెండు సినిమాలు మిస్‌ఫైర్‌ అవ్వడంతో ఇప్పుడు కొత్త ట్రాక్‌లోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నాడు శివ. ఈసారి క్లాస్‌ని కాకుండా మాస్‌ని టార్గెట్‌ చేస్తూ సినిమా చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నాడు. పేరులో మాస్‌ ఉన్న మాస్‌ మహారాజ రవితేజతో సినిమా చేయబోతున్నాడు. ఔట్‌ అండ్‌ ఔట్‌ మాస్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని ప్లాన్‌ చేస్తున్నాడు. ఈ సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్‌ వర్క్‌ కూడా కంప్లీట్‌ అయిందని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మించనుంది. అజనీష్‌ లోకనాథ్‌ ఈ చిత్రానికి సంగీతం అందిస్తారు. తను ఇప్పటివరకు టచ్‌ చేయని మాస్‌ జోనర్‌ని శివ ఎలా హ్యాండిల్‌ చేస్తాడు అనేది ఇప్పుడు అందరిలోనూ ఉన్న సందేహం. వరస పరాజయాలతో ఉన్న శివ ఈసారి మాస్‌ టచ్‌తో చేస్తున్న ఈ సినిమాతో హిట్‌ ట్రాక్‌లోకి వస్తాడేమో చూడాలి.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.