English | Telugu

పవన్ కళ్యాణ్ సింగ‌ర్‌కి పెళ్లి ఫిక్స‌యింది

పవన్ కళ్యాణ్ సినిమా వ‌కీల్ సాబ్ గుర్తుందా? అందులో కంటిపాపా కంటిపాపా అనే పాట గుర్తుందా? ఆ పాట‌ను పాడిన సింగ‌ర్ పేరు గుర్తుందా? య‌స్‌... అత‌నే అర్మాన్ మాలిక్‌. ఆయ‌న‌కు పెళ్లి ఫిక్స యింది. ఆయ‌న చిర‌కాల స్నేహితురాలు ఫ్యాష‌న్ ఇన్‌ఫ్లుయ‌న్స‌ర్ ఆష్నా ష్రాఫ్‌ని వివాహం చేసుకోబోతున్నారు. సోమ‌వారం వీరిద్ద‌రికీ ఎంగేజ్‌మెంట్ జ‌రిగింది.

ఈ విష‌యాన్ని అర్మాన్ మాలిక్ ఇన్‌స్టాగ్రామ్ లో అనౌన్స్ చేశారు. త‌న ఎంగేజ్‌మెంట్‌కి సంబంధించి కేండిడ్ మూమెంట్స్ ని షేర్ చేసుకున్నారు. ఆ పిక్స్ తో పాటు ``మా సుదీర్ఘ ప్ర‌యాణం ఇప్పుడే మొద‌లైంది`` అని రాశారు. ప్రేమ సింబ‌ల్స్ కూడా షేర్ చేశారు.

అర్మాన్ త‌మ పెళ్లి గురించి చెప్ప‌గానే, పాపుల‌ర్ సెల‌బ్రిటీలు ఈషా గుప్తా, జ‌రీన్ ఖాన్‌తో పాటు ప‌లువురు శుభాకాంక్ష‌లు తెలిపారు. వ‌రుణ్ ధావ‌న్‌, టైగ‌ర్ ష్రాఫ్‌, ఇషాన్ క‌ట్ట‌ర్ ఇద్ద‌రికీ విషెస్ చెప్పారు.

ఆష్నా కూడా త‌న డ్రీమీ ఎంగేజ్‌మెంట్ పిక్స్ షేర్ చేశారు. నీ న‌మ్మ‌కం, నీ మీద‌నాకు న‌మ్మ‌కాన్ని క్రియేట్ చేసింది అంటూ హార్ట్ ఎమోజీతో పోస్ట్ చేసింది.
ఈషా గుప్తా కూడా రెడ్ హార్ట్ ఎమోజీల‌ను పోస్ట్ చేశారు. దివ్యాంప త్రిపాఠీ కంగ్రాజులేష‌న్స్ చెప్పారు. ఇద్ద‌రికీ ఆనందం, ఆరోగ్యం, సౌభాగ్యం క‌ల‌గాల‌ని ఆశీర్వ‌దించారు. సింగ‌ర్ హ‌ర్ష‌దీప్ కౌర్ కూడా సంతోషంగా ఉండ‌మ‌ని శుభాకాంక్ష‌లు చెప్పారు.

ఆష్రా ష్రాఫ్‌
ఆష్రా ష్రాఫ్ యంగ్ యూట్యూబ‌ర్‌. ఫ్యాష‌న్‌, బ్యూటీ ఇన్‌ఫ్లుయ‌న్స‌ర్‌. ఆమెకు ఈ ఏడాదికిగానూ కాస్మోపాలిట‌న్ ల‌గ్జ‌రీ ఫ్యాష‌న్ ఇన్‌ఫ్లుయ‌న్స‌ర్ ఆఫ్ ది ఇయ‌ర్ గుర్తింపు ద‌క్కింది.

అర్మాన్ మాలిక్‌
అర్మాన్ మాలిక్ ఇండియ‌న్ ఓక‌లిస్ట్. పాట‌లు రాస్తారు. రికార్డ్ ప్రొడ్యూస‌ర్‌. వాయిస్ ఓవ‌ర్ ఆర్టిస్ట్. పెర్ఫార్మ‌ర్‌. యాక్ట‌ర్‌. హిందీ, త‌మిళ్‌, తెలుగు, గుజ‌రాతీ, ఉర్దూ, మ‌ల‌యాళం, బెంగాలీ, క‌న్న‌డ‌లో చాలా పాట‌లు పాడారు. ఎంఎస్ ధోనీతో పాటు ప‌లు సినిమాల్లో హిట్ సాంగ్స్ పాడారు అర్మాన్.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .