English | Telugu
హన్సిక చాప్టర్ క్లోజ్ చేసిన శింబు
Updated : Feb 26, 2014
శింబు, హన్సికల ప్రేమాయణం ముగిసినట్లే అని గతకొద్దికాలంగా వార్తలు వస్తున్నాయి. కానీ ఈ వార్తలకు వ్యతిరేకంగా వీళ్ళిద్దరూ అప్పుడప్పుడు కలుసుకునే ఉంటున్నారు. అయితే ఈ విషయంపై ఎవరూ కూడా స్పందించలేరు. తాజాగా శింబు తన ప్రేమాయణం ముగిసిందని ప్రకటించేసాడు. "ఎంతో అలోచించి ఈ నిర్ణయం తీసుకొన్నా. హన్సికతో బంధం ముగిసిన కథ. ఆ విషయం గురించి ఎక్కువగా మాట్లాడటం నాకు ఇష్టం లేదు. నా అభిమానులకు, స్నేహితులకు స్పష్టత ఇచ్చేందుకే ప్రేమ విషయాన్ని బహిరంగంగా వెల్లడిస్తున్నా. ఇకపై నా కెరీర్ పైనే దృష్టిపెట్టదలచుకొన్నా. ఇప్పుడు చాలా ప్రశాంతంగా ఉంది" అని ట్విట్టర్ లో పోస్ట్ చేసాడు.
అయితే శింబు ఈ విధంగా హన్సికతో విడిపోవడానికి కారణం నయనతార మాత్రమే కారణమని అందరూ అనుకుంటున్నారు. ఇటీవలే వీళ్ళిద్దరూ మళ్ళీ క్లోజ్ అయ్యారు. ప్రస్తుతం వీళ్ళిద్దరూ కలిసి నటిస్తున్న ఓ సినిమాలో భార్యభర్తలుగా నటిస్తున్నారు. అందుకే వీరి ప్రేమ మళ్ళీ మొదలవ్వడంతో శింబు... హన్సికను దూరం చేసాడని తెలుస్తుంది. త్వరలో నయనతార శింబులు పెళ్లి కూడా చేసుకోవాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది. మరి వీరిద్దరి ప్రేమాయణం ఎంతవరకు వెళుతుందో చూడాలి.