English | Telugu
కొత్తది మొదలెట్టిన సాయి
Updated : Feb 27, 2014
హీరో సాయిరాం శంకర్ కి ఇప్పటి వరకు కూడా ఒక్క కమర్షియల్ సక్సెస్ కూడా దక్కలేదు. వరుస ఫెయిల్యూర్ సినిమాలతో సతమతమవుతున్న సాయి.. తాజాగా ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. శ్రీచిన్న గోవిందా మూవీ మేకర్స్ బ్యానర్లో వెంకట కృష్ణ నిర్మించనున్నారు. "పూర్తి యాక్షన్ తరహాలో రూపొందనున్న ఈ సినిమాలో కొత్త తరహాలో సాయి కనిపించనున్నాడు" అని నిర్మాత న్నారు. మార్చి చివరివారంలో షూటింగ్ ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.