Read more!

English | Telugu

హీరోగా ప్రభాస్ సోదరుడు సిద్ధార్థ్ రాజ్ కుమార్

హీరోగా ప్రభాస్ సోదరుడు సిద్ధార్థ్ రాజ్ కుమార్ తెలుగు సినీ పరిశ్రమలోకి ప్రవేశించనున్నాడు. వివరాల్లోకి వెళితే ప్రముఖ సీనియర్ నటుడు రెబెల్ స్టార్ కృష్ణంరాజు వరసుడిగా యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా మారి ఆయన పేరు నిలబెడుతున్నాడు. ప్రస్తుతం అదే ఫ్యామిలీ నుండి మరో ఆరడుగుల అందగాడు సిద్ధార్థ్ రాజ్ కుమార్ హీరోగా తెలుగు సినీ రంగంలోకి అతి త్వరలో ప్రవేశించనున్నారు. సిద్ధార్థ్ రాజ్ కుమార్ గతంలో తెలుగు సినిమాల్లో బాలనటుడిగా నటించాడు.

ఉదాహరణకు ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా, యస్.జె.సూర్య దర్శకత్వంలో నటించిన "నాని" సినిమాలో బాల మహేష్ బాబుగా నటించాడు. సిద్ధార్థ్ రాజ్ కుమార్ హీరోగా నటించబోయే చిత్రాన్ని కన్నడంలో టాప్ ప్రొడ్యూసర్ గా ఉన్న యస్.వి.బాబు తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో, తన సొంత బ్యానర్ యస్.వి.ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మించనున్నారు. సిద్ధార్థ్ రాజ్ కుమార్ హీరోగా నటించబోయే ఈ చిత్రానికి సంబంధించిన నటినటుల, సాంకేతిక నిపుణుల వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఈ కొత్త హీరో సిద్ధార్థ్ రాజ్ కుమార్ కి ఆల్ ది బెస్ట్ చెపుతోంది తెలుగు వన్.