English | Telugu

అవతార్ 3 ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే.. ఇండియాలో మాత్రం ఆ సినిమా దెబ్బకొట్టిందా!


-కలెక్షన్స్ ఎంత!
-ఇండియాలో దెబ్బకొట్టింది ఎవరు
-ప్రేక్షకులు ఏమంటున్నారు


జేమ్స్ కామెరూన్ నుంచి వచ్చిన మరో అద్భుత సృష్టి 'అవతార్ ఫైర్ అండ్ యాష్' నిన్న వరల్డ్ వైడ్ గా కనివిని ఎరుగని రీతిలో అత్యధిక థియేటర్స్ లో విడుదలైంది.ఒక్క ఇండియాలోనే అన్ని లాంగ్వేజెస్ లో కలిపి 5200 షోస్ ని ప్రదర్శించారంటే ఏ స్థాయిలో రిలీజ్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు పెద్ద ఎత్తున థియేటర్స్ కి పోటెత్తడంతో అన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డ్స్ దర్శనమిచ్చాయి. తెలుగు రాష్ట్రాలతో సహా ఇండియా మొత్తం ఇంచుమించు అదే పరిస్థితి. దీంతో తొలి రోజు అవతార్ ముంగిట భారీ కలెక్షన్స్ వచ్చి చేరాయి.

ఈ చిత్రం తొలి రోజు వరల్డ్ వైడ్ గా 60 మిలియన్ల డాలర్స్ ని వసూలు చేసింది. మన ఇండియన్ కరెన్సీ లో 600 కోట్ల రూపాయలు. దీంతో ఓపెనింగ్ డే కలెక్షన్స్ విషయంలో మొదటి రెండు పార్ట్ ల కంటే ఫైర్ అండ్ యాష్ ఎక్కువ రాబట్టిందని చెప్పవచ్చు. కాకపోతే ఇండియన్ సినీ ప్రేమికులు మాత్రం ఫైర్ అండ్ యాష్ కి షాక్ ఇచ్చారు.అవతార్ రెండవ భాగం ఇండియాలో 40 కోట్లకి పైగా రాబట్టింది. కానీ ఫైర్ అండ్ యాష్ 20 కోట్ల ని మాత్రమే రాబట్టింది. ఈ మేరకు ట్రేడ్ వర్గాలు వారు ధృవీకరిస్తున్నారు. ధురంధర్ ప్రభావం అనే మాటల్నికూడా వాళ్ళు వ్యక్త పరుస్తున్నారు.

Also read:ప్రముఖ అగ్ర నటుడి మృతి.. షాక్ లో అగ్ర హీరోలు

ప్రస్తుతం వరల్డ్ వైడ్ గా 'ఫైర్ అండ్ యాష్' కి మిక్స్డ్ రివ్యూస్ వస్తున్నాయి. విజువల్స్ బాగున్నా మూవీ చాలా స్లో గా ఉందనే అభిప్రాయాన్ని ప్రేక్షకులు వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఫైర్ అండ్ యాష్ సాధించే కలెక్షన్స్ పై అందరిలో ఆసక్తి నెలకొని ఉంది.