English | Telugu

జానీ మాస్టర్‌ కేసులో ట్విస్ట్‌.. షాక్‌ ఇచ్చిన బాధితురాలు!

కొరియోగ్రాఫర్‌గా అగ్రస్థానంలో కొనసాగుతున్న జానీ మాస్టర్‌పై 2024 సెప్టెంబర్‌ 11న లైంగిక వేధింపుల కేసు నమోదైన విషయం తెలిసిందే. అతని దగ్గర అసిస్టెంట్‌గా పనిచేస్తున్న మైనర్‌ బాలిక.. తనను లైంగికంగా వేధించాడంటూ కేసు నమోదు చేయడంతో టాలీవుడ్‌ ఒక్కసారిగా ఉలిక్కిపడిరది. అయితే 2019లో ఇది జరిగింది. చాలా ఆలస్యంగా ఆ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకొచ్చింది బాధితురాలు.

కేసు నమోదు చేసుకున్న పోలీసులు జానీమాస్టర్‌పై ఎఫ్‌ఐఆర్‌ బుక్‌ చేశారు. 36 రోజులు జైలులో ఉన్న జానీ.. ఆ తర్వాత బెయిల్‌పై విడుదలయ్యాడు. ఇప్పుడు కేసు విచారణలో ఉంది. తాజాగా ఈ కేసులో బాధితురాలు టీఎఫ్‌టీడీడీఏ(TFTDDA) ప్రెసిడెంట్‌ వి.వి. సుమలతాదేవిపై తీవ్ర ఆరోపణలు చేశారు. తనను వేధింపులకు గురిచేసిన జానీ మాస్టర్‌ను కాపాడేందుకు సుమలత ప్రయత్నిస్తున్నారని సోషల్‌ మీడియా వేదికగా తన ఆవేదన వ్యక్తం చేసింది. పోక్సో(POCSO) చట్టం కింద విచారణ ఎదుర్కొంటున్న నిందితుడ్ని కేసు నుంచి తప్పించేందుకు ఒక బాధ్యాతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తి ప్రయత్నించడం ఎంతవరకు కరెక్ట్‌ అని బాధితురాలు ప్రశ్నిస్తోంది.

‘ప్రస్తుతం నేను పనిచేస్తున్న ప్రదేశంలో సురక్షితంగా ఉన్నానా, ఒక నేరస్తుడ్ని కాపాడేందుకు నాపై ఇలాంటి ఆరోపణలు చేయడం అవసరమా?’ అని సోషల్‌ మీడియాలో చేసిన పోస్టులో బాధితురాలు ప్రశ్నించింది. ఈ పోస్టుకు సంబంధించిన వీడియోలు, స్క్రీన్‌ షాట్స్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి. లైంగిక వేధింపుల ఆరోపణలతో అరెస్ట్‌ అయి, కొన్నాళ్లు జైలులో ఉండి వచ్చిన జానీ మాస్టర్‌ ప్రస్తుతం బెయిల్‌పై ఉన్నాడు. తాజాగా బాధితురాలు చేసిన ఆరోపణలు మరోసారి ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారుతున్నాయి.

అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఇదే.. దక్షిణాది వాళ్ళం అలాంటివి చేసుకోము కదా  

ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish)గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలిసిందే. వెంట వెంటనే సినిమాలు చేయకపోయినా అడపా దడపా తన రేంజ్ కి తగ్గ సినిమాల్లో కనిపిస్తు మెప్పిస్తు వస్తున్నాడు. ప్రస్తుతం ఎలాంటి కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయకపోయినా ప్రీవియస్ చిత్రం 'బడ్డీ'తో పర్వాలేదనే స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. శిరీష్ కి అక్టోబర్ 31 న నయనిక రెడ్డి తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో పెళ్లి డేట్ ని అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పుడు ఆ డేట్ పై అధికార ప్రకటన వచ్చింది.