English | Telugu

"శ్రీ రామరాజ్యం" 50 రోజులు విజయవాడలో

"శ్రీ రామరాజ్యం" 50 రోజులు విజయవాడలో జరుపనున్నారని తెలిసింది. వివరాల్లోకి వెళితే యువరత్న నందమూరి బాలకృష్ణ శ్రీరామచంద్రమూర్తిగా, నయనతార సీతాదేవిగా, శ్రీకాంత్ లక్ష్మణుడిగా, సాయికుమార్ భరతుడిగా, నటసామ్రాట్, డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు వాల్మీకి మహర్షిగా నటించగా, బాపు గారి దర్శకత్వంలో, యలమంచిలి సాయిబాబు నిర్మించిన పౌరాణిక చిత్రం "శ్రీరామరాజ్యం". ఈ "శ్రీరామరాజ్యం" చిత్రం విడుదలై అశేష ప్రేక్షకాదరణతో 50 రోజులు పూర్తిచేసుకుంది.

ఈ "శ్రీరామరాజ్యం" 50 రోజులు పూర్తిచేసుకున్న సందర్భంగా, ఆ అర్థ శతదినోత్సవ వేడుకలను విజయవాడ నగరంలోని పి.డబ్ల్యూ.డి. గ్రౌండ్ లో, 2012 జనవరి 5 వ తేదీన ఘనంగా జరిపేందుకు నిర్మాత యలమంచిలి సాయిబాబు సన్నాహాలు చేస్తున్నారు. మామూలుగా ఈ రోజుల్లో ఒక సినిమా పట్టుమని పదిరోజులాడిందంటే పెద్ద హిట్టని భావిస్తున్నారు. అలాంటిది "శ్రీరామరాజ్యం" వంటి పౌరాణిక చిత్రాన్నిఇంత బాగా ఆదరిస్తూన్న తెలుగు ప్రేక్షకుల అభిరుచికి జోహార్లు చెప్పకుండా ఉండలేం కదా...!

సైక్ సిద్ధార్ధ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవేనా! పగ వాడికి కూడా ఆ బాధ రాకూడదు

శ్రీ నందు(Shree Nandu)చాలా గ్యాప్ తర్వాత సోలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటు 2026 కి వెల్ కమ్ చెప్తు నిన్న 'సైక్ సిద్దార్ధ'(Psych Siddhartha)తో సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. పక్కా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కగా బాగానే ఉందనే టాక్ ని సొంతం చేసుకుంది.  రివ్యూస్ కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. పైగా సింగల్ స్క్రీన్స్ తో సహా మల్టి ప్లెక్స్ లో టికెట్ రేట్స్ ని భారీగా తగ్గించారు. దీంతో అందరి చూపు సైక్ సిద్దార్ధ వైపు పడిందనే టాక్ సినీ సర్కిల్స్ లో వినిపిస్తుంది. మరి మొదటి రోజు ఏ మేర కలెక్షన్స్ ని రాబట్టిందో చూద్దాం.