English | Telugu

నాగచైతన్యను పెళ్లి చేసుకోవడానికే ఇండస్ట్రీకి వచ్చిందట!

సాధారణంగా పెద్ద హీరోయిన్‌ అవ్వడానికి ఇండస్ట్రీకి వచ్చాను అని ఇండస్ట్రీకి వచ్చిన అమ్మాయి ఎవరైనా అనేమాటే. అయితే దానికి భిన్నంగా ఒక హీరోని పెళ్ళి చేసుకోవడానికే ఇండస్ట్రీకి వచ్చానని ఒక అమ్మాయి చెప్పడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. సోషల్‌ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ హాట్‌ ఫోటోలు, వీడియో పెడుతూ కనిపించే రీతూ చౌదరి పై స్టేట్‌మెంట్‌ ఇచ్చింది. తన అందం, అభినయంతో రకరకాల టీవీ షోల్లో సందడి చేసే రీతూ చాలా మంది ఫ్యాన్స్‌ను వెనకేసుకుంది.

తాజాగా అలీ యంకర్‌గా నిర్వహిస్తున్న ‘ఆలీతో ఆల్‌ ఇన్‌ వన్‌’ అనే కార్యక్రమంలో రీతూ చౌదరి, జెస్సీ, స్రవంతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అసలు నువ్వు ఇండస్ట్రీకి ఎందుకొచ్చావు? అని రీతూ చౌదరిని ఆలీ అడిగినపుడు.. ఆలీ సైతం షాక్‌ అయ్యే సమాధానం చెప్పింది రీతూ. ‘నేను నాగచైతన్యను పెళ్లి చేసుకుందామని ఇండస్ట్రీకి వచ్చాను’ అంది. దీంతో ఆలీ ఒక్కసారి షాక్‌ అయ్యాడు. ఇది ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో మాత్రమే. ఈ షో సెప్టెంబర్‌ 26న టెలికాస్ట్‌ కానుంది. ఇంకా ఈ షోలో ఏమేం సంగతులు చెప్పిందో తెలియాలంటే మంగళవారం వరకు ఆగాల్సిందే.