English | Telugu

ఫ్లాప్ సినిమా ఐదు వేల స్క్రీన్ లలో..

చైనాలో న్యూ ఇయర్ కి శంకర్ ఐ సినిమా అక్కడ విడుదల కానుంది. ఏకంగా ఒకేసారి ఐదు వేల స్క్రీన్ ల మీద ప్రదర్శితం కానుంది. ఇప్పటికే తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదలైన 'ఐ' చైనా లో మాత్రం కాస్తంత లేటుగా విడుదల కానుంది. ఈ మేరకు చైనీ ప్రభుత్వం నుంచి అనుమతులు వచ్చాయని తెలుస్తోంది. అక్కడ సెన్సార్ షిప్ కూడా పూర్తయ్యిందని.. ఇక విడుదలే తరువాయి అని సమాచారం.చైనాలో ప్రతి యేటా కేవలం 50 విదేశీ సినిమాలు మాత్రమే విడుదల కావాల్సి ఉంటుంది. ప్రభుత్వం ఈ మేరకే అమనుతులు ఇస్తుంది. విదేశీ సినిమాలు వచ్చి తమ దేశ సినిమా మార్కెట్ ను దెబ్బతీయకుండా అక్కడి నియంతృత్వ కమ్యునిస్టు ప్రభుత్వం ఈ చర్యలు తీసుకొంటుంది. ఈ 50 సినిమాల్లో హాలీవుడ్ వే ఎక్కువగా ఉంటాయి. అడపాదడపా మాత్రం భారతీయ సినిమాలకు అవకాశం వస్తూ ఉంటుంది.ఇది వరకూ త్రీ ఇడియట్స్, ధూమ్ -3 వంటి సినిమాలు చైనాలో విడుదల అయ్యాయి..పర్వాలేదనిపించుకొనేలా వసూళ్లను సాధించాయి. ఇలాంటి నేపథ్యంలో ఐ కి ఎట్టకేలకూ అవకాశం దక్కింది. సినిమాను కొంత మేర చైనాలో చిత్రీకరించడం తో ఇది స్థానికుల్లో ఆసక్తిని రేకెత్తించగలదని నిర్మాతలు లెక్కలేసుకొంటున్నారు. తక్కువలో తక్కువ అనుకొన్నా ఈ సినిమాకు చైనా వ్యాప్తంగా 20 కోట్ల రూపాయల వరకూ వసూళ్లు దక్కుతాయని ఒక అంచనా.

రూమర్స్ కి చెక్.. ఉస్తాద్ భగత్ సింగ్ గురించి మొత్తం చెప్పేసింది

సిల్వర్ స్క్రీన్ పై పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్'(Pawan Kalyan)స్టామినాని మరింతగా ఎలివేట్ చెయ్యబోతున్న చిత్రం 'ఉస్తాద్ భగత్ సింగ్'(Ustaad.ఇప్పటి వరకు రిలీజైన ప్రచార చిత్రాల ద్వారా ఆ విషయం అర్ధమవుతుండటంతో పాటు దర్శకుడు హరీష్ శంకర్ కూడా ఆ విషయంలో అభిమానులకి, ఫ్యాన్స్ కి పూర్తి భరోసాని ఇస్తున్నాడు. వచ్చే ఏడాది వేసవికి థియేటర్స్ లో అడుగుపెట్టే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ సినిమా గురించి ప్రముఖ హీరోయిన్ సాక్షి వైద్య చెప్పిన కొన్ని విషయాల ద్వారా ఎప్పట్నుంచో సినీ సర్కిల్స్ లో దర్జాగా చక్కర్లు కొడుతున్న ఒక పుకారు కి  పుల్ స్టాప్ పడినట్లయింది.