English | Telugu

వెట‌కారం c/o ర‌వితేజ



సినిమాలో హీరోయిజం ఫుల్లుగా ఉందండీ
- దానికి ఓ ట‌న్నుడు వెట‌కారం క‌ల‌పండి!

ఈ సినిమా కామెడీ కావ‌ల్సినంత ఉందండీ.
- దానికి క్వింటాలు బ‌లుపు క‌ల‌పండి!

సినిమా అంతా యాక్ష‌నే నండీ...
- ఇప్పుడు లారీడు పొగ‌రు మిక్స్ చేయండి!

బ‌స్‌స్‌స్‌స్‌స్‌స్..... ర‌వితేజ పాత్ర రెడీ అయిపోతుంది. ఇక కిక్కే కిక్కు...

వెట‌కారంలో వినోదం, యాక్ష‌న్లో బ‌లుపు, హీరోయిజంలో ప‌వ‌రూ మిక్స్ చేసి కొడితే - అదే ర‌వితేజ సినిమా.

క‌మీష‌న‌ర్ కూతుర్ల‌కు మొగుళ్లు రారా అన్న‌ప్పుడు ర‌వితేజ మాస్‌లోకి వెళ్లిపోయాడు
సిటీకి ఎంతోమంది క‌మీష‌న‌ర్లు వ‌స్తుంటారు.. పోతుంటారు.. చంటిగాడు లోక‌ల్ అన్న‌ప్పుడు.. అక్క‌డే తిష్ట‌వేసుకొని కూర్చుండిపోయాడు. ఇక రాడు.

ఏం ఎన‌ర్జీ అండీ అదీ.


పెట్రోల్ అడ‌గ‌ని బుల్లెట్ స్పీడు అత‌నిది. ఆ స్పీడుకి స్పీడో మీట‌ర్ కూడా అష్ట‌వంక‌ర్లు తిరిగిపోతుంది.
ఏం దూకుడండీ..


హీరో అంటే ఇలా ఉంటాడా అనిపిస్తుంది. మ‌నం కూడా అలా ఉంటే బావుణ్ణు క‌దా అనిపిస్తుంది. సినిమా చూస్తున్నంత సేపూ మ‌న‌లోనూ ర‌వితేజ‌లాంటి హీరో పుటుక్కున పుట్టుకొచ్చేస్తుంటాడు.

అత‌ని యాక్ష‌న్లో జోరుంటుంది. ఫైట్స్‌లో జోరుంటుంది. న‌వ్వులో జోరుంటుంది. న‌డ‌క‌లో జోరుంటుంది. ఆఖ‌రికి అది సెంటిమెంట్ సీన్ అయినా.. అందులోనూ త‌న‌దైన స్పీడుంటుంది. ఈ బండికి బ్రేకుల్లేవ్‌.. ఇది ఎక్క‌డా ఆగ‌దు. అదంతే.

క‌ర్త‌వ్యం సినిమా చూసుంటారు. ఒక‌టికి ప‌దిసార్లు చూసిన‌వాళ్లూ ఉంటారు. ఎన్నిసార్లు చూసినా అందులో ర‌వితేజ ఉన్నాడ‌న్న సంగ‌తి చాలామంది క‌నిపెట్ట‌లేరు. ఎందుకంటే ఈ సినిమాలో ర‌వితేజ‌ది ఓ చిన్న పాత్ర‌. నిజాయ‌తీగా చెప్పాలంటే గుంపులో గోవిందం క్యారెక్ట‌రు. అలాంటి ర‌వితేజ ఒక్కో మెట్టూ ఎక్కాడు. ఒక్కో అడుగూ వేశాడు. జూనియ‌ర్ ఆర్టిస్టు రేంజు నుంచి హీరోల సైడ్ నిల‌బ‌డే సైడార్టిస్టు అయ్యాడు. ఆ త‌ర‌వాత సెకండ్ హీరో పొజీష‌న్ అందుకొన్నాడు. అక్క‌డా క్లిక్క‌య్యి.. సోలోగా నిల‌బ‌డిపోయాడు. బాక్సాఫీసు ద‌గ్గ‌ర మాస్ మ‌హారాజా అవ‌తారం ఎత్తాడు. త‌న మాసీజంతో ర‌చ్చ రంబోలా చేసేశాడు.

ర‌వితేజ అనుభ‌విస్తున్న స్టార్ డ‌మ్‌, హోదా... కేవ‌లం అత‌ను సంపాదించుకొన్న‌వే. దాన్ని అదృష్టం అంద‌లం ఎక్కించిందంటే ప్ర‌తిభ కిసుక్కున న‌వ్వుతుంది. గాలివాటం అత‌న్ని స్టార్‌ని చేసిందంటే.. ఆ గాలి కూడా సుడిగాలై.. పెనుగాలై విజృంభిస్తుంది. ఇదంతా అత‌ని క‌ష్టార్జితం. హీరో అయినంత వ‌రకూ క‌ష్ట‌ప‌డ్డాడు. ఆత‌ర‌వాతా చమ‌టోడ్చాడు. త‌న బ‌లాబ‌లాలేంటో త‌న‌కు తెల్సు. ఏ దారిలో వెళ్తే ప్రేక్ష‌కుల అండ‌దండ‌లు ల‌భిస్తాయో త‌న‌కు తెల్సు. అదే దారిలో వెళ్లాడు. అనుకొన్న‌ది సాధించాడు.

ర‌వితేజ - పూరి జ‌గ‌న్నాథ్ కాంబినేష‌న్ సూప‌ర్ హిట్టు. ఇద్ద‌రూ జ‌త క‌డితే... హిట్సు వ‌రుస‌క‌ట్టాయి.
ర‌వితేజ‌లోని హీరోయిన‌జాన్ని పూరి బ‌య‌ట‌కు తీశాడో, లేదంటే పూరిలోని ద‌ర్శ‌కుడికి కావ‌ల్సిన హీరోలా రవితేజ‌ త‌న‌కి తాను మారిపోయాడో
తెలీదు గానీ.. వీరిద్ద‌రి కాంబినేష‌న్ తెలుగు ప్రేక్ష‌కుల‌కు వినోదాలు పంచింది. హీరోయిజంలోని అస‌లు సిస‌లైన కిక్ రుచి చూపించింది. ర‌వితేజ అంటే ఎంట‌ర్‌టైన్‌మెంట్‌, ఎంట‌ర్‌టైన్ మెంట్ అంటే ర‌వితేజ అనుకొనేలా చేసింది. ఇట్లు శ్రావ‌ణి సుబ్ర‌హ్మ‌ణ్యం, అమ్మానాన్న ఓ త‌మిళ అమ్మాయి. ఇడియ‌ట్‌, నేనింతే.... ఇలా వీరి విజృంభ‌ణ కొన‌సాగుతోంది. విక్ర‌మార్కుడు, కృష్ణ, కిక్‌ సినిమాల‌తో ర‌వితేజ రేంజు పెరిగిపోయింది. ర‌వితేజ సినిమా హిట్ట‌యితే.. క‌నీసం రూ.30 కోట్లు గుమ్మ‌రించేస్తారు ఆడియ‌న్స్‌. ఆ న‌మ్మ‌కం నిర్మాత‌ల‌కు ఉంది. అందుకే.. ర‌వితేజ వెంట ప‌డుతున్నారు.

ర‌వితేజ అంటే ఎంట‌ర్‌టైన్‌మెంటేనా.. అంటే - ఊహూ... ఇంకా ఏదో ఉంది. మై ఆటోగ్రాఫ్ స్వీట్ మొమొరీస్‌లాంటి క‌థ‌ల‌తోనూ ఆయ‌న ద‌గ్గ‌ర‌కు వెళ్లొచ్చు. దొంగ‌ల ముఠాలాంటి ప్ర‌యోగాలూ ఆయ‌న చేయ‌గ‌ల‌రు. ఆ న‌మ్మ‌కం ద‌ర్శ‌కుల‌కు క‌ల్పించాడు ర‌వితేజ‌. నేనింతేలో ఎంట‌ర్‌టైన్‌మెంట్ ఎక్క‌డ‌..?? సీరియ‌స్‌గా ల‌క్ష్యం వైపు దూసుకెళ్లే వ్య‌క్తి క‌థ అది. అయితే వినోదాన్ని ప‌క్క‌న పెట్టిన ర‌వితేజ సినిమా ఏదీ... స‌రిగా ఆడ‌లేదు. అందుకే ఆయ‌నకి కాస్త భ‌యం. ఈ మార్గ‌మ‌ధ్య‌లో కొన్ని ఫ్లాపులు, అట్ట‌ర్ ఫ్లాపులు కూడా భ‌య‌పెట్టాయ్‌. ర‌వితేజ కెరీర్‌కి స్పీడు బ్రేక‌ర్లు వేశాయి. కానీ మ‌ళ్లీ బ‌లుపు, ప‌వ‌ర్‌ల‌తో.. రేసులోకి వ‌చ్చేశాడు మాస్ మ‌హారాజా. ఇప్పుడు కిక్ 2తో డ‌బుల్ ధ‌మాకా అందివ్వ‌బోతున్నాడు. ఈసినిమా వేస‌వికి ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ర‌వితేజ కిక్ ఇలాగే కొన‌సాగాల‌ని.... మ‌రిన్ని సినిమాల‌తో ప్రేక్ష‌కుల్ని ఈ మాస్ మ‌హారాజా ఎంట‌ర్‌టైన్ చేయాల‌ని మ‌న‌స్ఫూర్తిగా కోరుకొంటోంది తెలుగు వ‌న్‌. మాస్ మ‌హారాజా.. హ్యాపీ బ‌ర్త్‌డే టూ యూ.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.