English | Telugu

సినిమా ఛాన్స్ ఇప్పిస్తామ‌ని మైన‌ర్‌పై లైంగిక దాడి.. ఆందోళ‌న‌లో చిత్ర ప‌రిశ్ర‌మ‌

సినిమాల మీద ఆసక్తితో ఎంతో మంది చిత్ర పరిశ్రమలో తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు వస్తుంటారు. అయితే వారికి సినిమాల్లో అవకాశాలు రాకపోగా ఎక్కువ శాతం మోసపోతుంటారు. ముఖ్యంగా అమ్మాయిలు ఈ విషయంలో ఎక్కువగా బలవుతున్నారు. ఇప్పటికే క్యాస్టింగ్‌కౌచ్‌ పేరుతో మోసపోయిన వారు ఎంతో మంది ఉన్నారు. వారికి సంబంధించిన ఘటనలు ఒక్కొక్కటిగా బయటికి వస్తూనే ఉన్నాయి. సినిమాల్లో నటించాలని కోరిక ఉన్న అమ్మాయిల పాలిట క్యాస్టింగ్‌ కౌచ్‌ ఓ మహమ్మారిగా మారింది.


ఇప్పటికే ఇలాంటి కథలు చాలా వెలుగులోకి వచ్చాయి. దోషులను కటకటాల వెనక్కి పంపారు కూడా. అయినా ఇది ఆగడం లేదు. తాజాగా హైదరాబాద్‌లోని ఫిలింనగర్‌ పోలీస్‌ స్టేషన్‌లో క్యాస్టింగ్‌ కౌచ్‌కి సంబంధించిన ఫిర్యాదు అందింది. అది కూడా ఒక మైనర్‌ బాలిక ఇవ్వడం ప‌రిశ్ర‌మ వర్గాల్లో ఆందోళన కలిగిస్తోంది.


సినిమాల్లో అవకాశాలు ఇప్పిస్తామని నమ్మబలికి అసిస్టెంట్‌ డైరెక్టర్‌ శివారెడ్డి, అకౌంటెంట్‌ అనిల్‌ ఈ దారుణానికి పాల్పడ్డారు. ఒక మైనర్‌ బాలికపై చాలా కాలంగా లైంగిక దాడికి పాల్పడుతున్న ఘటన వెలుగులోకి వచ్చింది. సినిమా ఇండిస్టీలో తమకు బాగా పలుకుబడి ఉందని, సినిమాల్లో అవకాశాలు ఇప్పిస్తామని నమ్మించి వారిద్దరూ పదే పదే ఆమెను శారీరకంగా వేధిస్తున్నారని తెలిసింది.


సినిమాల్లో నటించాలన్న తన ఆశను, బలహీనతను ఆసరాగా చేసుకొని తనపై లైంగిక దాడి చేసినట్టు ఫిర్యాదులో బాధితురాలు పేర్కొంది. ఈ విషయం బయట పడుతుందనే కారణంతో ఆమెను పలుమార్లు బెదిరించారట. వారి దారుణాలను ఎంతో ఓపికగా భరించిన ఆ బాలిక చివరికి పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు అందుకున్న పోలీసులు శివారెడ్డి, అనీల్‌లపై కేసు నమోదు చేసి, పిఓసిఎస్‌ఓ చట్టం కింద వారిద్దరినీ అరెస్ట్‌ చేశారు. దీనిపై సమగ్ర దర్యాప్తు చేసి నిందితులపై చర్య తీసుకుంటామని పోలీసులు చెబుతున్నారు.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .