English | Telugu

సంగీత దిగ్గజం ఘంటసాల బయోపిక్.. రిలీజ్ ఎప్పుడంటే..?

ఇప్పటికే ఎన్టీఆర్, సావిత్రి వంటి తెలుగు సినీ దిగ్గజాల బయోపిక్ లు చూశాం. త్వరలో తెలుగు సినిమా తొలితరం నేపథ్యగాయకులలో ఒకరు, దిగ్గజ సంగీత దర్శకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు బయోపిక్ చూడబోతున్నాం.

ఘంటసాల వెంకటేశ్వరరావు జీవితాన్ని ఆధారంగా చేసుకుని 'ఘంటసాల' పేరుతో చిత్రాన్ని రూపొందించారు దర్శకుడు సి.హెచ్. రామారావు. ఘంటసాల జీవితంలోని విభిన్న ఘట్టాలను ఈ సినిమాలో కళ్ళకు కట్టినట్లు చూపించి, ప్రివ్యూ షోలతోనే ప్రేక్షకుల మెప్పు పొందారు.

ఘంటసాల వీరాభిమానుల కోరిక మేరకు లండన్, సింగపూర్, ఆస్ట్రేలియా, అమెరికా వంటి దేశాల్లో ప్రత్యేక ప్రీవ్యూ షోలు నిర్వహించగా.. అక్కడ నివసిస్తున్న భారతీయులు ఈ చిత్రాన్ని చూసి తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఘంటసాల గాత్రాన్ని, మహిమను మరోసారి అనుభవించేలా ఈ సినిమా ఉందని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరికీ చేరువయ్యేలా బయోపిక్ ని రూపొందించిన దర్శకుడు సి.హెచ్. రామారావుపై ప్రశంసలు కురిపించారు.

Also Read: విడుదలకు కొన్ని గంటల ముందు లీక్.. అఖండ-3 టైటిల్ ఇదే..!

ప్రివ్యూ షోలతో ప్రశంసలు అందుకున్న ఘంటసాల బయోపిక్.. డిసెంబర్ 12న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ విషయాన్ని మేకర్స్ తాజాగా అధికారికంగా ప్రకటించారు. అదేవిధంగా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ వివరాలను కూడా పంచుకున్నారు. డిసెంబర్ 5న హైదరాబాద్‌లో గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ జరగనుంది.

ఘంటసాల అమరగానాన్ని, ఆయన అసామాన్య జీవితాన్ని మరోసారి గుర్తు చేసేలా రూపొందించిన ఈ సినిమా కోట్లాది మంది ప్రేక్షకుల చేత చప్పట్లు కొట్టిస్తుందని నమ్మకం వ్యక్తం చేశారు మేకర్స్.

అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఇదే.. దక్షిణాది వాళ్ళం అలాంటివి చేసుకోము కదా  

ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish)గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలిసిందే. వెంట వెంటనే సినిమాలు చేయకపోయినా అడపా దడపా తన రేంజ్ కి తగ్గ సినిమాల్లో కనిపిస్తు మెప్పిస్తు వస్తున్నాడు. ప్రస్తుతం ఎలాంటి కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయకపోయినా ప్రీవియస్ చిత్రం 'బడ్డీ'తో పర్వాలేదనే స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. శిరీష్ కి అక్టోబర్ 31 న నయనిక రెడ్డి తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో పెళ్లి డేట్ ని అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పుడు ఆ డేట్ పై అధికార ప్రకటన వచ్చింది.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.