English | Telugu

ఏంటి కవిత గారు దణ్ణం పెట్టడం కూడా చేత కాదా!

సీనియర్ నటి కవిత.. తెలుగు సినిమా చరిత్రలో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. కె విశ్వనాథ్ డైరెక్షన్ లో సిరి సిరి మువ్వతో తెలుగులో నటిగా అరంగేట్రం చేసిన కవిత.. ఇండస్ట్రీకి వచ్చి ఇరవై సంవత్సరాలైంది. అయితే కవిత తన వ్యక్తిగత జీవితం గురించి పొలిటికల్ లైఫ్ గురించి తెలుగువన్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికరమైన విషయాలను పంచుకుంది.

మీకు ఎన్టీఆర్ ఎలా తెలుసని ప్రశ్నించగా.. "మేం చెన్నైలో టీనగర్ లో ఒక పార్క్ దగ్గర ఉండేవాళ్ళం. ఆ పార్క్ కి అటువైపు మేము.. ఇటువైపు ఎన్టీగారు ఉండేవారు. నేను మా అమ్మ కలిసి పొద్దున్నే నాలుగు గంటలకు ఎన్టీఆర్ గారిని దర్శించుకోడానికి వెళ్ళేవాళ్ళం. ఆయనని చూడగానే కాళ్ళకి దండం పెట్టేవాళ్ళం. ఆయనని చూడటానికి ఎక్కడెక్కడి నుండో జనాలు బస్సుల్లో వచ్చేచారు.

తిరుపతిలో వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకున్నవాళ్ళు.. తర్వాత ఎన్టీఆర్ గారిని దర్శించుకునేవాళ్ళు. మా అమ్మ , ఎన్టీఆర్ గారు మంచి స్నేహితులు.. అలా మా అమ్మ నన్ను ఆయనకు పరిచయం చేసింది. ఆ తర్వాత లాయర్ విశ్వనాథ్ సినిమాలో ఆయనకి చెల్లెలి పాత్రలో నటించాను" అని కవిత చెప్పింది.తను సీనియర్ ఎన్టీఆర్ తో కలిసి పొలిటికల్ ర్యాలీలో పాల్గొందంట. అయితే అలా ర్యాలీలో వెళ్తున్నప్పుడు ఆయన ఒక కుగ్రామంలో ఒక చెట్టుకింద దుప్పటి వేసుకుని పడుకున్నాడు. ఎప్పుడు ఆయన సామాన్యుడినే అని చెప్పేవారు అని తెలిపింది.

ఎన్టీఆర్ గారితో ఎన్ని సినిమాలలో నటించారని ప్రశ్నించగా.. "చాలా సినిమాలలో చేసాను.‌ వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర సినిమా షూటింగ్ కోసం కడప వెళ్ళాం. అక్కడ నేను ఒక చెట్టు వెనకాల ఉన్నాను. అక్కడ ఆశ్రమంలో ఎన్టీఆర్ గారు ఉన్నారు.. అక్కడ నుండి మెగాఫోన్ లో మాట్లాడుతున్నారు నాకర్థం కాలేదు.. దాంతో కాసేపటికి హరికృష్ణ గారు నా దగ్గరికి వచ్చి తప్పుగా దణ్ణం పెట్డమని చెప్పారు. దాంతో నేను అలాగే చేసాను. దానికి ఎన్టీఆర్ గారు పిలిచి.. ఏంటి కవిత గారు దణ్ణం పెట్టడం కూడా చేత కాదా అని అందరిముందు అనేసరికి నేను ఏడ్చేసాను.

ఆ తర్వాత బాపయ్య గారి డైరెక్షన్ లో అగ్గి రవ్వ చేసాను. అందులో నేను హీరోయిన్ ని... ఎన్టీఆర్‌ గారు హీరోగా డ్యుయల్ రోల్ చేసారు.. ఆ తర్వాత చండశాసనుడు సినిమాలో గెస్ట్ రోల్ గా చేసాను" అని చెప్పుకొచ్చింది కవిత. ఇలా తన కెరీర్ మరియు వ్యక్తిగత జీవితం గురించి ఆమె తెలుగు వన్ తో షేర్ చేసుకుంది.


'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.