English | Telugu

నాని సెగ ఆడియో రిలీజ్

నాని "సెగ" ఆడియో రిలీజ్ మే 15 వ తేదీన, హైదరాబాద్ ప్రసాద్‍ ల్యాబ్ లో జరిగింది. వివరాల్లోకి వేళితే నాని, నిత్యమీనన్, బిందు మాధవి, కార్తీక్ జంటలుగా, అంజన ఆలీ ఖాన్ దర్శకత్వంలో తమిళంలో నిర్మిస్తున్న "వెప్పం" చిత్రాన్ని, తెలుగులో "సెగ" పేరుతో వల్లభనేని అశోక్ కుమార్ అనువదిస్తున్నారు. నాని "సెగ" చిత్రం ఆడియో రిలీజ్ నటుడు డాక్టర్ రాజశేఖర్ చేతుల మీదుగా తొలి సి.డి.ని ప్రముఖ నటి, దర్శకురాలు శ్రీమతి విజయ నిర్మల అందుకోగా, ఆదిత్య మ్యూజిక్ ద్వారా మార్లెట్లోకి విడుదల చేయబడింది.

ఈ నాని "సెగ" సినిమా ఆడియో రిలీజ్ కు దర్శకురాలు నందనీ రెడ్డి, సంగీత దర్శకురాలు యమ్.యమ్.శ్రీలేఖ, నిత్య మీనన్, బిందు మాధవి, నాని, కార్తీక్, సంగీత దర్శకుడు జోష్వా శ్రీధర్, దర్శకుడు సాగర్, నిర్మాతల మండలి కార్యదర్శి ప్రసన్న కుమార్, దర్శకుడు చంద్ర సిద్ధార్థ తదితరులు హాజరయ్యారు.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.