English | Telugu

అల్లరి నరేష్ సీమటపాకాయ్ ఆడియో రిలీజ్

అల్లరి నరేష్ "సీమటపాకాయ్" చిత్రం ఆడియో రిలీజ్ ఏప్రెల్ 18 వ తేదీన జరిగింది. వివరాల్లోకి వెళితే వెల్ ఫేర్ క్రియేషన్స్ పతాకంపై, అల్లరి నరేష్ హీరోగా, పూర్ణ అనే కొత్తమ్మాయిని హీరోయిన్ గా పరిచయం చేస్తూ, జి.నాగేశ్వర రెడ్డి దర్శకత్వంలో, డాక్టర్ మళ్ళ విజయ ప్రసాద్ నిర్మిస్తున్న పూర్తి హాస్యభరిత చిత్రం "సీమటపాకాయ్".

హైదరాబాద్ లో మాదాపూర్ హైటెక్స్ లో కల ఎరోజ్ రెస్టారెంట్ లో, నటకిరీటి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ ముందుగా టెన్ థౌజండ్ వాలాను పేల్చి వచ్చి, తన చేతుల మీదుగా డాక్టర్ కె.యల్.నారాయణ తొలి సి.డి.ని అందుకోగా అల్లరి నరేష్ హీరోగా నటిస్తున్న "సీమటపాకాయ్" చిత్రం ఆడియో మధుర ఎంటర్ టైన్ మెంట్స్ ద్వారా మార్కెట్లోకి రిలీజ్ చేయబడింది.

ఈ అల్లరి నరేష్ "సీమటపాకాయ్" చిత్రం ఆడియో విడుదలకు యువ హీరోలు నాని, శర్వానంద్, తనీష్, కృష్ణుడు, దర్శకులు హరీష్ శంకర్, నందినీ రేడ్డి, తమ్మారెడ్డి భరద్వాజ నటులు డాక్టర్ బ్రహ్మానందం, తనికెళ్ళ భరణి, ఎ.వి.యస్, జీవా, నాగినీడు తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా రాజేంద్ర ప్రసాద్ ప్రసంగిస్తూ నవ్వు భగవంతుడి స్వరూపమనీ, నవ్వుని నమ్ముకున్న వాళ్ళకి ఎప్పటికీ డిమాండ్ ఉంటుందనీ, మనసు బాగోకపోతే తన సినిమాలను భారత ప్రథాని వంటి వారే చూసేవారనీ, అల్లరి నరేష్ గురించి తనకు ఎక్కువ బాధ్యత ఉందనీ, ఈ అల్లరి నరేష్ "సీమటపాకాయ్" చిత్రం ఘనవిజయం సాధించాలని కోరుతున్నానన్నారు.

ఈ ఆడియో విడుదలకు అతిథిగా విచ్చేసిన యువ హీరో నాని మాట్లాడుతు "నాతో నరేష్ నీ సినిమాల ఆడియో ఫంక్షన్లకి నేనొస్తాను. నా సినిమాల ఆదియో ఫంక్షన్లకి నూవ్వు రావాలి అనడిగాడు. ఇదేదో బాగుందని ఒప్పుకున్నా. కానీ ఇప్పుడర్థమవుతోంది. యేడాదికి నేనొక సినిమా చేస్తే నరేష్ ఏడెనిమిది సినిమాలు చేస్తాడని. ఎనీవే ఈ సీమటపాకాయ్ పెద్ద హిట్ కావాలని ఆశిస్తున్నాను" అని అన్నారు.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.