English | Telugu
మంచు హీరోని రిజెక్ట్ చేసిన రాంగోపాల్ వర్మ
Updated : Sep 17, 2013
శర్వానంద్ హీరోగా రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం "సత్య-2". ఈ చిత్ర ఆడియో విడుదల కార్యక్రమం పలువురు సినీ ప్రముఖుల మధ్య జరిగింది. ఈ కార్యక్రమానికి మంచు విష్ణు కూడా హాజరయ్యాడు. ఈ సంధర్భంగా మంచు విష్ణు మాట్లాడుతూ.... వర్మ గారికి నేనంటే అసలు నచ్చదు. మరి ఎందుకో తెలియదు. ఒకసారి నాతో సినిమా చేయమని నా మిత్రుడు ద్వారా అడిగిస్తే"విష్ణుతో సినిమా ఏం తీస్తాం" అని అనేసాడు. అదే విధంగా ఓసారి కలిసి మాట్లాడుతున్నప్పుడు నేను బాగా వంట కూడా చేస్తాను అని అంటే "వంటలు చేసే వాళ్ళన్నా, బాగా తినే వాళ్ళన్నా నచ్చదు అని చెప్పేశాడు. ఆ తర్వాత రెండు సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఈ ఆడియో వేడుకలో కలిసాము అని చెప్పారు.