English | Telugu
రూమర్ ని నిజం చేసిన నటుడు
Updated : Sep 17, 2013
మంచు లక్ష్మీ ప్రసన్న అంటే అందరికి తెలిసిందే. బ్రిటిష్ వాళ్ళు మన తెలుగును మాట్లాడితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. కానీ ఈమె బాగా ఎక్కువగా మాట్లాడుతదని బయట ఒక టాక్ ఉంది. ఇదంతా కేవలం రూమర్స్ అని వదిలేద్దాం. అయితే తాజాగా రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం "సత్య-2". ఈ చిత్ర ఆడియో విడుదల కార్యక్రమం ఇటీవలే పలువురు సినీ ప్రముఖుల మధ్య జరిగింది.
అయితే ఈ ఆడియో వేడుకకు మంచు విష్ణు, మంచు లక్ష్మీ ప్రసన్న ఇద్దరు కూడా హాజరయ్యారు. అయితే ఈ సందర్భంగా విష్ణు మాట్లాడుతూ అనుకోకుండా లక్ష్మీ టాక్ షో గురించి చెబుతూ..."మా అక్క ఎక్కువగా.... బాగా మాట్లాడను" అంటూ నాలుక కరుచుకుని.. వెంటనే అక్కడే లక్ష్మీకి సారీ చెప్పేసాడు. పైగా ఆ మాటలకూ కవరింగ్ చేస్తూ.."హేయ్ మా అక్క ఎక్కువగా మాట్లాడదయ్యా... బాగా క్యుట్ గా, చాలా బాగా మాట్లాడుతది" అంటూ కవరింగ్ చేసాడు. కానీ అక్కడున్నవారు మాత్రం నిజమే కదా అని నవ్వుకున్నారు.