English | Telugu

వరుణ్‌కు 'హ్యాపీడేస్' వచ్చేనా!

"హ్యాపీడేస్, కొత్తబంగారు లోకం" మినహా వరుణ్ సందేశ్‌కు మరో హిట్టు లేదు. "ఏమైంది ఈవేళ" అనే చిత్రం మాత్రం "సంపత్‌నంది" ("రచ్చ" ఫేం) అనే డైరెక్టర్‌తోపాటు.. నిషా అగర్వాల్ అనే హీరోయిన్‌ని తెలుగు తెరకు పరిచయం చేసింది. ఇంతకు మించి అతని కెరీర్‌లో చెప్పుకోవడానికేమీ లేవు. వరుస ఫ్లాపులతో వరుణ్ సందేశ్‌కు ధియేటర్ మార్కెట్ అన్నది లేకుమ్డా పోయింది. మొన్నటివరకు కొద్దో.. గొప్పో ఉన్న శాటిలైట్ మార్కెట్ కూడా ఘోరంగా పడిపోతూ వస్తోంది. ఈ క్రమంలో తన తాజా చిత్రం "సరదాగా అమ్మాయితో"పై వరుణ్ చాలా ఆశలు పెట్టుకొన్నాడు. "ఏమైంది ఈవేళ" చిత్రంలో తనతో జతకట్టిన కాజల్ అగర్వాల్ సిస్టర్ నిషా అగర్వాల్.. "సరదాగా అమ్మాయితో" చిత్రంలో మరోసారి నటించింది. తన ఒంపుసొంపులతో ఇప్పటికే కురాకారును కిక్కెస్తున్న ఛార్మీ ఈ చిత్రంలో స్పెషల్ రోల్ చేస్తోంది. ఈ చిత్రం రేపు (జూన్ 14న) ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ చిత్రం ఓ మోస్తరుగానైనా విజయం సాధించడం వరుణ్ సందేశ్‌కు ఎంతైనా అవసరం. ఈ చిత్రం జయాపజాయలను బట్టి.. అతను నటిస్తున్న మిగతా చిత్రాల భవితవ్యం ఆధారపడి ఉంటుంది!

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.