English | Telugu
సంజయ్ దత్ కి భారీ స్థాయిలో డబ్బులు చెల్లిస్తున్న పూరి జగన్నాధ్
Updated : Nov 6, 2023
90 వ దశకంలో బాలీవుడ్ ని ఏలిన ఎంతో మంది అగ్ర హీరోల్లో సంజయ్ దత్ కూడా ఒకరు. ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో హీరో గా నటించిన సంజయ్ దత్ తన సెకండ్ ఇన్నింగ్స్ లో విలన్ గా నటిస్తూ ప్రేక్షకులని అలరిస్తు వస్తున్నాడు. తాజాగా ఆయన రామ్ పోతినేని, పూరి ల కాంబోలో వస్తున్న డబుల్ ఇస్మార్ట్ లో విలన్ గా నటిస్తున్నాడు. ఈ మూవీకి సంబంధించి సంజయ్ దత్ తీసుకుంటున్న రెమ్యూనరేషన్ ఇప్పుడు టాక్ ఆఫ్ ది తెలుగు సినిమా ఇండస్ట్రీ అయ్యింది
పూరి జగన్నాధ్ ,రామ్ పోతినేని కాంబోలో డబుల్ ఇస్మార్ట్ శంకర్ మూవీ తెరకెక్కుతుంది. ఈ మూవీ లో సంజయ్ దత్ విలన్ గా చేస్తున్నాడనే విషయాన్ని మేకర్స్ ఇది వరకే ప్రకటించారు. ఈ మూవీ లో ని తన క్యారక్టర్ కి సంబంధించి సంజయ్ దత్ అక్షరాల 6 కోట్ల రూపాయలని తీసుకుంటున్నాడనే వార్త ఇప్పుడు తెలుగు ఫిలిం సర్కిల్స్ లో హల్ చల్ చేస్తుంది. పాన్ ఇండియా లెవెల్లో సినిమా లు రూపుదిద్దుకుంటున్న దగ్గర నుంచి సంజయ్ దత్ కి బాగా డిమాండ్ ఏర్పడింది. కెజిఎఫ్ 2 తో పాటు లేటెస్ట్ గా వచ్చిన లియో మూవీలో సంజయ్ దత్ చేసిన విజృంభణ అందరి తెలిసిందే. ఇప్పుడు పూరి, రామ్ పోతినేని ల డబుల్ ఇస్మార్ట్ లో కూడా సంజయ్ దత్ విజృంభణ ఖాయమని అంటున్నారు.
భారతీయ చిత్ర పరిశ్రమ గర్వించదగిన గొప్ప నటుడు సంజయ్ దత్ అని అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. 90 వ దశకం నుంచే తెలుగులో ఆయనకీ అభిమానులు ఉన్నారు. అప్పట్లో ఆయన హెయిర్ స్టైల్ ని ఫాలో అయిన వాళ్ళు కూడా చాలా ఎక్కువ. పాన్ ఇండియా సినిమా లు ప్రారంభం అయిన దగ్గర నుంచి సంజయ్ దత్ హవా ప్రారంభం అయ్యిందంటే సంజయ్ దత్ ఎంత గొప్ప పాన్ ఇండియా నటుడో అర్ధం చేసుకోవచ్చు. ఎలాంటి క్యారెక్టర్ లో అయిన సూపర్ గా నటించి ఆ క్యారెక్టర్ ని ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచేలా చెయ్యడం సంజయ్ దత్ స్టైల్. అందుకే సంజయ్ దత్ అడిగినంత రెమ్యునరేషన్ ఇవ్వడానికి నిర్మాణ సంస్థలు వెనుకాడటం లేదు. పైగా సంజయ్ దత్ సినిమాలో ఉండటం వలన పాన్ ఇండియా లెవల్లో ఆ సినిమాకి క్రేజ్ ఉంటుంది.