English | Telugu
కిచ్చాని మర్చిపోయిన సమంత
Updated : Jul 2, 2014
అందాల ముద్దుగుమ్మ సమంత నాగచైతన్యకు జతగా నటించిన మూడో చిత్రం ‘ఆటో నగర్ సూర్య’. ఇటీవలే విడుదలైన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. ‘ఆటో నగర్ సూర్య’లో సమంత అభినయానికి మంచి మార్కులే పడ్డాయి. కాగా ఈ చిత్రం గురించి సమంత మాట్లాడుతూ... దేవా కట్టా, నాగచైతన్య సినిమా కోసం చాలా కష్టపడ్డారంటూ ‘ఆటో నగర్ సూర్య’ని ఆదరించి విజయవంతం చేసిన ప్రేక్షకులకు నా కృతజతలు అని అన్నారు. ఇక ఈ సినిమాలో ప్రాముఖ్యత కలిగిన పాత్ర పోషించిన మరో హీరో నందు గురించి చెప్పడం మర్చిపోయానంటూ.. తర్వాత ట్విట్టర్లో వ్యాఖ్యానించింది. కిచ్చా పాత్రలో నందు నటన సూపర్బ్ అని పేర్కొంది సమంత.