English | Telugu

కొండా సురేఖను తెలివిగా ఇరికించిన సమంత.. వైరల్‌ అవుతున్న వీడియో!

కొన్నిరోజుల క్రితం తెలంగాణ మంత్రి కొండా సురేఖ మీడియాతో మాట్లాడుతూ కేటీఆర్‌పై ఆరోపణలు చేసే క్రమంలో సమంత గురించి పలు వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఆమె విడాకులు ఎందుకు తీసుకున్నారు అనేదానిపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. సమంతకు కొండా సురేఖ క్షమాపణలు చెప్పడం, నాగార్జున ఆమెపై పరువు నష్టం దావా వెయ్యడం వంటివి జరిగిపోయాయి. తాజాగా సమంత చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి.

తాను ఎంతో కష్టపడి పైకి వచ్చానని, జీవితంలో ఎన్నో ఒడిడుకులు చూశానని అన్నారు. కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై గతంలోనే స్పందించిన సమంత.. తనను రాజకీయాల్లోకి లాగొద్దని విజ్ఞప్తి చేశారు. తాజాగా మరోసారి దీనిపై స్పందించారు. సిటాడెల్‌ వెబ్‌ సిరీస్‌లో నటించిన సమంత ఆ సిరీస్‌కి సంబంధించిన మీడియా సమావేశంలో పాల్గొన్నారు సమంత. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ‘ఇటీవల నాకు ఎదురైన సమస్య పట్ల ఇండస్ట్రీ ఎంతో సానుకూలంగా స్పందించింది. పరిశ్రమలోని వారంతా నాకు మద్దతు ప్రకటించారు. మీరంతా ఇచ్చిన ధైర్యంతోనే నేను నిలబడగలిగాను. మీ సపోర్ట్‌ లేకపోతే నేను ఇక్కడికి ఇలా రాలేకపోయేదాన్ని. మానసికంగా ఇంకా కుంగిపోయే దాన్ని. ఈ విషయంలో నాకు సపోర్ట్‌ చేసిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను’ అన్నారు.

సినిమాకి ఉన్న శక్తిని మరోసారి చాటి చెప్పావు.. వాళ్ళు భయపడుతున్నారంట! 

కళ.. పేరుగా చూసుకుంటే నామ్ చోటా.. కానీ పంచ భూతాలకి ఎంత శక్తీ ఉందో 'కళ' కి అంతే శక్తీ ఉంది. ఈ కళ నుంచి సినిమా(cinema)రూపంలో వచ్చే మాట, పాట, నటన, నటుడు, దృశ్యం అనేవి మనిషి నరనరనరాల్లో చాలా భద్రంగా ఉండిపోతాయి. ఆ ఐదింటి ద్వారా తమకి బాగా దగ్గరయ్యే  నటుడ్ని అయితే సూపర్ హీరోగా  చేసి తమ గుండెల్లో దైవశక్తిగా భద్రంగా కొలుచుకుంటూ ఉంటారు. ఇళయ దళపతి విజయ్ అప్ కమింగ్ మూవీ జననాయగన్(Jana Nayagan)రేపు ప్రీమియర్స్ నుంచే అడుగుపెడుతుండటంతో సినిమా గొప్ప తనం గురించి మరో సారి సోషల్ మీడియా వేదికగా చర్చ జరుగుతుంది. మరి ఆ చర్చల వెనక ఉన్న పూర్తి విషయం ఏంటో చూద్దాం.