English | Telugu

హీరోతో దొరికిపోయిన రీతూ చౌదరి.. వీడియోలు బయట పెట్టిన హీరో భార్య?

సినిమాల్లో, టీవీ సీరియల్స్‌లో, షోలతో బిజీగా ఉంటున్న రీతూ చౌదరి.. రీసెంట్‌గా బిగ్‌బాస్‌ సీజన్‌ 9లో కంటెస్టెంట్‌గా చేస్తోంది. సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే రీతూ.. సినిమాలు, షోల కంటే రకరకాల కాంట్రవర్సీల ద్వారా ఎక్కువ పాపులారిటీ తెచ్చుకుంది. ఎప్పుడూ ఏదో ఒక వివాదంలో తలదూర్చడం ఆమెకు అలవాటుగా మారిపోయింది. తాజాగా ఒక హీరోతో ఎఫైర్‌ నడుపుతోందంటూ మరో కొత్త కాంట్రవర్సీతో వార్తల్లోకి వచ్చింది. తన భర్తతో రీతూ అక్రమ సంబంధం పెట్టుకుందంటూ టాలీవుడ్‌ హీరో భార్య గౌతమి ఆరోపిస్తూ వారిద్దరికి సంబంధించిన వీడియోలు బయటపెట్టింది. ఇప్పుడిది టాలీవుడ్‌లో హాట్‌ టాపిక్‌గా మారిపోయింది.

సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌గా ఉన్న గౌతమి ఈ వీడియోలను విడుదల చేస్తూ తన భర్త, టాలీవుడ్‌ హీరో ధర్మమహేష్‌పై ఆరోపణలు చేసింది. ఆ వీడియోల్లో రీతూ చౌదరి, మహేష్‌ ఒక రూమ్‌ నుంచి బయటికి తూలుతూ రావడం, ఆ తర్వాత లిఫ్ట్‌లో కలిసి ఉండడం కనిపించింది. ఇప్పుడీ వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి.

సింధూరం, డ్రిరకర్‌ సాయి వంటి సినిమాల్లో హీరోగా నటించి గుర్తింపు తెచ్చుకున్న ధర్మ మహేష్‌.. 2019లో గౌతమిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. 2023లో వీరికి ఒక బాబు పుట్టాడు. ఇంతవరకు బాగానే జరిగింది. కొన్ని రోజుల క్రితం తన భర్త అదనపు కట్నం కోసం వేధిస్తున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది గౌతమి. అప్పటికే రీతూతో మహేష్‌ రిలేషన్‌లో ఉన్నాడనే విషయం ఇప్పుడు విడుదల చేసిన వీడియోల ద్వారా తెలుస్తోంది. అయితే అదనపు కట్నం కోసం వేధిస్తున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేసినపుడు ఒక అమ్మాయితో రిలేషన్‌లో ఉన్నాడని చెప్పింది తప్ప ఆమె పేరు, వీడియోల గురించి గౌతమి ప్రస్తావించలేదు.

రీతూతో రిలేషన్‌ పెట్టుకోవడం వల్లే తనతో తరచూ గొడవలు పడుతున్నాడని గౌతమి ఆరోపిస్తోంది. తమ మధ్య గొడవలకి రీతూ కారణం అని చెబుతూ కొన్ని మెసేజ్‌లకు సంబంధించిన స్క్రీన్‌ షాట్స్‌ను కూడా సోషల్‌ మీడియాలో పెట్టింది. రీతూ, ధర్మ మహేష్‌ కలిసి ఒక ఫ్లాట్‌లోకి వెళ్తున్న వీడియోలను కూడా గౌతమి షేర్‌ చేసింది. వాట్సాప్‌ మెసేజ్‌లకు సంబంధించిన స్క్రీన్‌ షాట్స్‌లో కూడా రీతూ చౌదరి ప్రస్తావన ఉంది. అయితే గౌతమి పెట్టిన వీడియోల్లో ఇద్దరూ కలిసి ఒక ఫ్లాట్‌లోకి వెళ్లడం, మళ్లీ బయటికి రావడం, లిఫ్ట్‌లో కూడా కలిసి వెళ్లడం వంటివి క్యాజువల్‌గా జరిగినవా? లేక గౌతమి ఆరోపించినట్టు ఇద్దరి మధ్య రిలేషన్‌ ఉందా అనే విషయంలో క్లారిటీ రావాలంటే కొంతకాలం ఆగక తప్పదు.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.