English | Telugu

ఆ సినిమా సీక్వెల్‌ని క‌న్‌ఫ‌ర్మ్ చేసిన మ‌మ్ముట్టి!

మ‌ల‌యాళం సూప‌ర్‌స్టార్ మ‌మ్ముట్టి 71 ఏళ్ల వ‌య‌సులోనూ క్ష‌ణం తీరిక‌గా లేరు. అస‌లు ఖాళీగా కూర్చోవ‌డం అంటే ఎలా ఉంటుంది? అంటూ చ‌మ‌త్క‌రిస్తున్నారు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ, స‌క్సెస్‌ల‌ను టేస్ట్ చేస్తూ, ఫెయిల్యూర్స్ ని పాఠాలుగా తీసుకుంటూ ముందుకు సాగుతున్నారు మ‌మ్ముట్టి. పాత్ర ఎలాంటిదైనా, స‌న్నివేశం ఏం డిమాండ్ చేసినా, వెంట‌నే ప‌ర‌కాయ ప్ర‌వేశం చేసి శ‌భాష్ అనిపించుకుంటారు మ‌మ్ముట్టి. అందుకే మ‌మ్ముట్టికి మ‌ల‌యాళంలోనే కాదు, వ‌రల్డ్ వైడ్ ఫ్యాన్స్ ఉన్నారు.

ఆయ‌న ఫ్యాన్స్ ఎంత‌గానో ఎదురుచూస్తున్న బిగ్ బీ సీక్వెల్ బిలాల్ గురించి మాట్లాడారు. బిగ్‌బీ సీక్వెల్‌ని మ‌మ్ముట్టి, ఆయ‌న త‌న‌యుడు దుల్క‌ర్ స‌ల్మాన్ క‌లిసి చేస్తార‌నే టాక్ న‌డుస్తోంది. ఉన్ని ఆర్ ఈ సినిమా కోసం క‌థ‌ను సిద్ధం చేస్తున్నార‌ట‌. కింగ్ మేక‌ర్ మామున్ని క‌థ ప్ర‌ధానంగా సాగుతుంది. సీక్వెల్‌. మామున్ని సొసైటీలో ఎప్పుడూ అల‌జ‌డి సృష్టించాల‌నుకుంటాడు. అయితే అంత‌క‌న్నా అత‌నికి అండ‌ర్‌వ‌ర‌ల్డ్ లో ఉన్న త‌న‌వారి సుఖ‌శాంతులు ముఖ్యం. వాట‌న్నిటిని ఎలా బ్యాల‌న్స్ చేసుకున్నాడు? అనుకున్న‌ది సాధించాడా లేదా అనేది బిగ్ బీ క‌థ‌. డైర‌క్ట‌ర్ అమ‌ల్ నీర‌ద్ స్క్రిప్ట్ ఫైన‌ల్ చేసేశార‌ట‌. ప‌లువురు ర‌చ‌యిత‌ల‌తో క‌లిసి ఆయ‌న స్క్రిప్ట్ ఫైన‌ల్ చేసిన‌ట్టు వినికిడి. అంతా అనుకున్న ప్ర‌కార‌మే జ‌రిగితే ఈ ఏడాది మేలో సినిమా సెట్స్ మీద‌కు వెళ్తుంది.

సినిమాను ఎక్కువ శాతం పోలాండ్‌లో తెర‌కెక్కించాల‌ని భావిస్తున్నార‌ట‌. మ‌మ్ముట్టి, దుల్క‌ర్ ఇద్ద‌రూ చేతినిండా ప్రాజెక్టుల‌తో బిజీగా ఉన్నారు. ఈ సినిమా కోసం పోలాండ్ వెళ్లిన‌ప్పుడు కొన్నాళ్ల‌పాటు ఇద్ద‌రూ క‌లిసి ప‌ర్స‌న‌ల్ టైమ్‌ని కూడా స్పెండ్ చేయాల‌ని భావిస్తున్నార‌ట‌. ఎంత పెద్ద సినిమాకైనా 30 రోజులు కాల్షీట్ కేటాయించేలా ప్లాన్ చేసుకుంటున్న‌ట్టు ఆ మ‌ధ్య దుల్క‌ర్ స‌ల్మాన్ చెప్పిన విష‌యం జ‌నాల్లో బాగా న‌లిగింది.

ఇండియన్ సినిమా హిస్టరీలో ఇలాంటి సినిమా రాలేదు.. మారుతి ఏమంటున్నాడు

రెబల్ సాబ్ ప్రభాస్(Prabhas)పాన్ ఇండియా సిల్వర్ స్క్రీన్ పై తన కట్ అవుట్ కి ఉన్న క్యాపబిలిటీని రాజాసాబ్(The Raja saab)తో మరోసారి చాటి చెప్పాడు. ఇందుకు సాక్ష్యం రాజాసాబ్ తో తొలి రోజు 112 కోట్ల గ్రాస్ ని రాబట్టడమే.  ఈ మేరకు  మేకర్స్ కూడా ఈ విషయాన్ని అధికారకంగా ప్రకటిస్తూ పోస్టర్ ని కూడా రిలీజ్ చేసారు. దీంతో ప్రభాస్ అభిమానుల ఆనందానికి అయితే అవధులు లేవు. చిత్ర బృందం ఈ రోజు రాజా సాబ్ కి సంబంధించిన విజయోత్సవ వేడుకలు నిర్వహించింది. దర్శకుడు మారుతీ తో పాటు, నిర్మాత విశ్వప్రసాద్(TG Vishwa Prasad)రాజా సాబ్ హీరోయిన్స్ నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్ హాజరయ్యారు.

రాజాసాబ్ సర్కస్ 1935 .. సీక్వెల్ కథ ఇదేనా! 

పాన్ ఇండియా ప్రభాస్(Prabhas)అభిమానులు,ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రెబల్ మూవీ 'ది రాజాసాబ్'(The Raja saab)నిన్న బెనిఫిట్ షోస్ తో థియేటర్స్ లో ల్యాండ్ అయ్యింది. దీంతో థియేటర్స్ అన్ని హౌస్ ఫుల్ బోర్డ్స్ తో కళకళలాడుతున్నాయి. సుదీర్ఘ కాలం తర్వాత సిల్వర్ స్క్రీన్ పై వింటేజ్ ప్రభాస్ కనిపించడంతో ఫ్యాన్స్ ఆనందానికి అయితే అవధులు లేవు. రిజల్ట్ విషయంలో మాత్రం మిక్స్డ్ టాక్ వినపడుతుంది. రివ్యూస్ కూడా అదే స్థాయిలో  వస్తున్నాయి. కాకపోతే తెలుగు సినిమా ఆనవాయితీ ప్రకారం ఈ రోజు సెకండ్ షో కంప్లీట్ అయిన తర్వాత గాని అసలైన టాక్ బయటకి రాదు.