English | Telugu

సంపూ ల‌క్ తిరిగిందిరోయ్‌...

బ‌ర్నింగ్‌స్టార్ సంపూ బాబు.. ఒకే ఒక్క పోస్ట‌ర్‌తో ఆన్‌లైన్‌లో స్టార్ అయిపోయాడు. హృద‌య‌కాలేయం అంటూ గిలిగింత‌లు పెట్టాడు. క‌రెంటు తీగ సినిమాలో చిన్న స్పెష‌ల్ ఎప్పీరియ‌న్స్ ఇస్తే.... థియేట‌ర్లో గోల గోల‌. మంచు విష్ణు సంపూ బాబుతో ఓ సినిమా చేస్తున్నాడు. సింగం 123 అంటూ.... సంపూ ఆ సినిమాలో పోలీస్ ఆఫీస‌ర్ డ్ర‌స్సులో క‌నిపించ‌బోతున్నాడు. ఇప్పుడు ఈ క్రేజ్ ఎంత వ‌ర‌కూ వెళ్లిందంటే.. రాంగోపాల్ వ‌ర్మ సంపూతో ఓ సినిమా చేయాల‌ని ప్లాన్ చేస్తున్నాడ‌ట‌. రాంగోపాల్ వ‌ర్మ - సంపూ సినిమా అంటే ఇండ్ర‌స్ట్రీలో త‌ప్ప‌కుండా హాట్ టాపిక్కే. సంపూతో మ‌నీ లాంటి సినిమా చేయాల‌ని భావిస్తున్నాడ‌ట‌. ఆల్రెడీ ఓ లైన్ రెడీ అయ్యింది. ఈ సినిమాలోనూ సంపూ పోలీస్ ఆఫీస‌రే అని తేలింది. మొత్తానికి సంపూ ల‌క్ తిర‌గ‌బడిన‌ట్టే.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.