English | Telugu
"దరువు"మూవీ రివ్యూ
Updated : May 25, 2012
తెలుగువన్ రేటింగ్ - 3.25/5
కథ - బుల్లెట్ రాజా(రవితేజ) పక్కా గాలి బ్యాచ్ మనిషి...! అతనొక అనాథ. అతనికి ఖాజా(వెన్నెల కిశోర్) అనే ఒక నేస్తం ఉంటాడు. అనుకోకుండా బుల్లెట్ రాజా ఒక రోజు శ్వేత (తాప్సి) అనే అమ్మాయిని ఆమెకు హార్బర్ బాబు అనే ఒక గూండాతో నిశ్చితార్థం జరిగే సమయంలో చూస్తాడు. ఆమెతో ప్రేమతో పడతాడు బుల్లెట్ రాజా...! ఆమె డ్యాన్స్ నేర్చుకునే స్కూల్లో చేరి ఆమె మనసు గెలుచుకుంటాడు. ఇది తెలిసిన హార్బర్ బాబు తన మనుషులతో కలసి బుల్లెట్ రాజాను చంపటానికి వస్తాడు. చంపుతాడు. దీనికి కారణం యమలోకంలో చిత్ర గుప్తుడు యువ యముడిని ఇరుకున పెట్టే ప్రయత్నంలో భాగంగా ఆయుష్షు తీరని బుల్లెట్ రాజాని యమలోకానికి రప్పించటం. ఈ విషయం తెలుసుకున్న బుల్లెట్ రాజా యముడితో ఎలా ఆడుకున్నాడు...! ఆ తర్వాతేం జరిగిందనేది తెలుసుకోవాలంటే ఈ చిత్ర్రం చూడాల్సిందే.
విశ్లేషణ - తాను స్వయంగా సినిమాటోగ్రాఫర్ కావటం వల్ల దర్శకుడు శివకి సినిమా ఎలా తీయాలో ఒక అవగాహన ఉందనేది ఈ చిత్రం నిరూపించింది. ఇక స్క్రీన్ ప్లే సినిమా ఫస్ట్ హాఫ్ కన్నా సెకండ్ హాఫ్ బాగుంది. సినిమాని బోర్ కొట్టకుండా అన్ని రకాల ప్రేక్షకులను అలరించేలా ఈ సినిమాని తీశాడు శివ. సి.జి.వర్క్ కూడా బాగుంది. నిర్మాణపు విలువలు చాలా బాగున్నాయి.
నటన - రవితేజ నటన గురించీ, అతని ఎనర్జీ గురించి ప్రత్యేకంగా కొత్తగా చెప్పక్కరలేదు. అది అందరికీ తెలిసిన విషయమే. అలాగే ఈ చిత్రంలో కూడా రవితేజ తన పాత్రను యధాప్రకారం చక్కగా పోషించాడు. ఇలాంటివి పోషించటం అతనికి కొట్టిన పిండి. ఇక తాప్సి తన పాత్రకు న్యాయం చేసిందనే చెప్పాలి. బ్రహ్మానందం, రఘుబాబు, షాయాజీ షిండే, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, శ్రీనివాసరెడ్డి తదితరులు తమ తమ పాత్రలకు న్యాయం చేశారు.
సంగీతం - ఆడియో హిట్టయ్యింది. పాటలు వినటానికే కాకుండా చూడటానికి కూడా బాగున్నాయి.రీ-రికార్డింగ్ కూడా బాగుంది. సినిమాటోగ్రఫీ - బాగుంది. ముఖ్యంగా యమ లోకం సీన్లలో చాలా బాగుంది.
మాటలు - బాగున్నాయి...!
పాటలు - బాగున్నాయి.
ఆర్ట్ - చాలా బాగుంది.
ఎడిటింగ్ - ఎడిటింగ్ క్లీన్ గా ఉండి ఒక్క వేస్ట్ షాట్ లేకుండా సినిమా ఫ్రేమ్ బై ఫ్రేం స్పీడ్ గా చూపించింది.
కొరియోగ్రఫీ - చక్కగా ఉంది.
యాక్షన్ - ఒక హిట్ కమర్షియల్ సినిమాకి ఎలాగుండాలో ఆ విధంగా ఉంది.
సకుటుంబంగా హ్యాపీగా చూసే పూర్తిస్థాయి ఎంటర్ టైనర్ ఈ చిత్రం. ఎక్కడా అసభ్యత, అశ్లీలత లేకుండా సరదాగా చూడవచ్చు.