English | Telugu

పవర్ ఆడియో విడుదల తేది

మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న తాజా చిత్రం "పవర్". రచయిత బాబీ దర్శకుడిగా మారి తెరకెక్కిస్తున్న ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. త్వరలోనే బ్యాంకాక్ లో షూటింగ్ జరుపుకోనుంది. రవితేజ సరసన హన్సిక, రెజీనా జోడి కడుతున్నారు. తమన్ అందిస్తున్న ఈ చిత్ర ఆడియోను మే 11న విడుదల చేయనున్నారు. రవితేజ, తమన్ కాంబినేషన్ లో వచ్చిన అన్ని చిత్రాలు మ్యూజికల్ హిట్స్ గా నిలిచాయి. రాక్ లైన్ ఎంటర్ టైన్మెంట్స్ ప్రై.లిమిటెడ్ బ్యానర్లో నిర్మాత రాక్ లైన్ వెంకటేష్ నిర్మిస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

ఫస్ట్ డే రికార్డు కలెక్షన్స్.. పోస్టర్ రిలీజ్ చేసిన చిత్ర బృందం

సంక్రాంతికి  వెల్ కమ్ చెప్తు నవీన్ పొలిశెట్టి, మీనాక్షి చౌదరి నిన్న 'అనగనగ ఒక రాజు'(Anaganaga Oka Raju)తో సిల్వర్ స్క్రీన్ పై తమ సత్తా చాటడానికి అడుగుపెట్టారు. అగ్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్ మెంట్స్  అధినేత నాగవంశీ నిర్మాత కావడం ఈ చిత్రం స్పెషాలిటీ. నూతన దర్శకుడు మారి(Maari)దర్శకత్వంలో పూర్తి గ్రామీణ వాతావరణం నేపథ్యంలో తెరకెక్కగా, మార్నింగ్ షో నుంచే   పాజిటివ్ టాక్  తో దూసుకుపోతుంది.  దీంతో సంక్రాంతి పందెంలో ఈ చిత్రం సాధించే కలెక్షన్స్ పై అందరిలో ఆసక్తి నెలకొని ఉండగా, చిత్ర బృందం మొదటి రోజు కలెక్షన్స్ ని అధికారకంగా ప్రకటించింది.