English | Telugu

బిపాశా నా కోస్టార్ మాత్రమే- రానా

"బిపాశా నా కో-స్టార్ మాత్రమే" అని యువ హీరో దగ్గుపాటి రానా నొక్కి వక్కాణిస్తున్నారు. వివరాల్లోకి వెళితే తెలుగు సినీ పరిశ్రమలో "లీడర్ ‍" చిత్రం ద్వారా హీరోగా పరిచయమై, "దమ్ మారో దమ్" తన రెండవ చిత్రంగా హిందీలో నటించిన రానా ఇటీవల తనకూ, ప్రముఖ బాలీవుడ్ నటి, "దమ్ మారో దమ్" చిత్రంలో తన సరసన నటించిన బిపాషా బసుకూ మధ్యన ఏదో ఎఫైర్ ఉందనే రూమర్ బాగా వ్యాప్తిలో ఉండటంతో దాన్ని ఖండించటానికి తన ట్విట్టర్ లోఈ విషయం గురించి పోస్ట్ చేశారు.

"ఈ రూమర్లు ఎవరు వ్యాపింపచేస్తారో నాకర్థం కాదు. బిపాషా బసు జస్ట్ నా కో-స్టార్ మాత్రమే అంతకు మించి మా ఇద్దరి మధ్య ఇంకే సంబంధం లేదు. అలాగే గతంలో హీరోయిన్ శ్రియతో కూడా నాకిలాంటి ఎఫైర్ ఏదో ఉందనే రూమర్ వచ్చింది. శ్రియ నాకు కాలేజ్ మేట్. గత ఎనిమిదేళ్ళుగా శ్రియ నాకు ఒక మంచి ఫ్రెండ్ గా ఉంది. అంతమాత్రానికే ఇలా ఎవరితోపడితే వారితో ఎఫైర్లు అంటగట్టటం సంస్కారం అనిపించుకోదు" అని రానా తన ట్విట్టర్ లో పేర్కొన్నారు. హీరో అయ్యాక ఇలాంటివన్నీ తప్పదు రానా... భరించాల్సిందే. ఇలాంటివన్నీ పట్టించుకోకుండా నీ నటన మీద దృష్టి పెట్టటం ఉత్తమం.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.