English | Telugu
నోరు జారిన ఎన్టీఅర్ దర్శకుడు
Updated : Sep 19, 2013
మొన్నటివరకు "మీడియా అంటే వెంట్రుకతో సమానం" అంటూ రామ్ చరణ్ మీడియాపై నోరుపారేసుకున్న సంగతి అందరికి తెలిసిందే. అయితే తాజాగా ఇప్పుడు ఎన్టీఅర్ దర్శకుడు కూడా ఈ జాబితాలోకి చేరిపోయాడు.
"గబ్బర్ సింగ్" వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత హరీష్ శంకర్ తను కూడా తన లెక్కలను కాకుండా తిక్కలను చూపిస్తూ మీడియాపై నోరుపారేసుకున్నాడు. తాజాగా సోషల్ నెట్ వర్కింగ్ సైట్ ట్విట్టర్ ద్వారా హరీష్ శంకర్..... "ట్విట్టర్ లో నేను పెట్టే కామెంట్స్ మీడియా వారికి కాసులు కురిపిస్తున్నాయి. నేను పెట్టే పోస్టులే వారికి వార్తలవుతున్నాయి. అవే వార్తలుగా రాసుకొని పొట్ట పోసుకుంటున్నారంటూ" మీడియా గురించి నోరుజారాడు.
మరి నిజానికి హరీష్ శంకర్ చెప్పిందే నిజామా? కేవలం ఆయన పెట్టే పోస్టులే వల్లే మీడియావారి పొట్టలు నిండుతున్నాయా? మీడియా అంటే అంత అలుసా? ఇదే విషయం మీడియా సీరియస్ గా తీసుకుంటే తన సినిమాల గురించి జనాలకు అసలు తెలుస్తుందా? మరి ఇప్పటికైనా హరీష్ శంకర్ ఇలాంటి దూకుడు తగ్గిస్తే బాగుంటుంది.