English | Telugu
రామ్ బీస్ట్ మోడ్.. 'స్కంద' కోసం 12 కేజీల బరువు పెరిగాడు!
Updated : Sep 27, 2023
కొందరు హీరోలు సినిమాలోని పాత్రకు తగ్గట్టుగా తమ దేహాన్ని మలుచుకుంటారు. పాత్రకు సరిపోయేలా బరువు పెరగడమో, తగ్గడమో చేస్తుంటారు. ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని కూడా అదే కోవకు చెందుతాడు. తన తాజా చిత్రం 'స్కంద' కోసం ఏకంగా 12 కేజీల బరువు పెరిగాడు.
రామ్ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన సినిమా 'స్కంద'. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ నిర్మించిన ఈ పాన్ ఇండియా మూవీ రేపు(సెప్టెంబర్ 28) ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్స్ లో బోయపాటి మార్క్ మాస్ కనిపించింది. ఇక ఇందులో రామ్ లుక్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. గత చిత్రాలతో పోలిస్తే రామ్ దృఢంగా కనిపిస్తున్నాడు. ఈ లుక్ కోసం రామ్ ఏకంగా 12 కేజీల బరువు పెరిగాడట. 72 కేజీల బరువు ఉండే రామ్ ఈ సినిమా కోసం తన బరువుని 84 కేజీలకు పెంచుకున్నాడట. మరి ఈ స్కంద మూవీ రామ్ కష్టానికి తగ్గ ఫలితాన్ని ఇస్తుందేమో చూడాలి.