English | Telugu

కుక్కని కాపాడిన ఫైట్ మాస్టర్స్..ఆ వెంటనే పిల్లలకి పాలు 

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(prabhas)అప్ కమింగ్ మూవీ రాజాసాబ్(raja saab)పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై మారుతీ(maruthi)దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్ పది న విడుదల కాబోతుంది.నిధి అగర్వాల్(Nidhhi Agerwal)మాళవిక(malavika mohanan)హీరోయిన్లుగా చేస్తుండగా శరవేగంగా షూటింగ్ ని జరుపుకుంటుంది. తాజాగా కొన్నియాక్షన్ సన్నివేశాలకి సంబంధించి హైదరాబాద్ లోని అజీజ్ నగర్ లో చిత్రీకరించాలనే ప్లానింగ్ జరుగుతుంది.


ఈ క్రమంలో ఫైట్ మాస్టర్స్ రామ్ లక్షణ్(ram lakshman)ఆధ్వర్యంలో టీం ప్రాక్టీస్ చేస్తుంది.ఈ క్రమంలో ఒక సభ్యుడికి అక్కడే కొద్దీ దూరంలో ఒక కుక్క మూలుగు వినపడింది.దగ్గరకి వెళ్ళి చూస్తే రెండు పెద్ద కొండ రాళ్ల మధ్య కుక్క విరుక్కుపోయి బయటకి రాలేక అల్లాడిపోతుంది. తన పిల్లలు ఏమో ఆ పక్కనే దిగులుగా ఉన్నారు.దాంతో వాళ్లంతా ఒక క్రేన్ సహాయంతో కుక్కని బయటకి తీసుకురావడానికి ప్రయత్నించగా క్రేన్ రూఫ్ తెగిపోయింది.ఆ తర్వాత అతి కష్టం మీద కొండ రాయిని కొంచం పక్కకు తొలగించి, కుక్క కాలికి ఒక గుడ్డని కట్టి జాగ్రతగా బయటకి తీసుకొచ్చారు. ఆ వెంటనే కుక్క తన పిల్లల దగ్గరకెళ్ళి పాలు ఇచ్చింది.ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.


పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.