English | Telugu

రామ్ చరణ్ నిశ్చితార్థపుటుంగరం పది కోట్లు

ప్రముఖ యువ హీరో, మెగాస్టార్ నటవారసుడు అయిన రామ్ చరణ్, అపోలో గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ అధినేత మనవరాలు అయిన ఉపాసనా కామినేనిల నిశ్చితార్థం డిసెంబర్ ఒకటవ తేదీ అంటే ఈ రోజు రాత్రి 7.30 గంటలకు గండిపేట సమీపంలోని ఒక ఫామ్ హౌస్ లో అత్యంత వైభవంగా జరుగనుంది. ఈ నిశ్చితార్థానికి సుమారు రెండువేలమంది అతిథులు హాజరుకానున్నారని సమాచారం.ఇక్కడకు విచ్చేసే అతిథుల కోసం మూడంచెల భద్రతావలయాన్ని ఏర్పాటుచేశారు.

ఈ నిశ్చితార్థానికి విచ్చేసే అతిథులకు బార్ కోడింగ్ ఏర్పాటుచేశారు. వీరి నిశ్చితార్థానికి బెల్జియం నుండి పదికోట్ల ఖరీదైన వజ్రపుటుంగరాన్ని తెప్పించారు. అలాగే బ్యాంకాక్ నుండి రకరకాల పూలను కూడా తెప్పించారు. ఈ నిశ్చితార్థానికి పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు హాజరుకానున్నారు. ఇది పూర్తిగా ప్రైవేట్ ఫంక్షన్ అనీ, అభిమానులెవ్వరూ రావద్దనీ, అభిమానుల కోసం మరో ఫంక్షన్ ఏర్పాటు చేస్తామనీ మెగాస్టార్ వర్గం తెలియజేస్తోంది.

సైక్ సిద్ధార్ధ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవేనా! పగ వాడికి కూడా ఆ బాధ రాకూడదు

శ్రీ నందు(Shree Nandu)చాలా గ్యాప్ తర్వాత సోలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటు 2026 కి వెల్ కమ్ చెప్తు నిన్న 'సైక్ సిద్దార్ధ'(Psych Siddhartha)తో సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. పక్కా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కగా బాగానే ఉందనే టాక్ ని సొంతం చేసుకుంది.  రివ్యూస్ కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. పైగా సింగల్ స్క్రీన్స్ తో సహా మల్టి ప్లెక్స్ లో టికెట్ రేట్స్ ని భారీగా తగ్గించారు. దీంతో అందరి చూపు సైక్ సిద్దార్ధ వైపు పడిందనే టాక్ సినీ సర్కిల్స్ లో వినిపిస్తుంది. మరి మొదటి రోజు ఏ మేర కలెక్షన్స్ ని రాబట్టిందో చూద్దాం.