English | Telugu

తనికెళ్ళ భరణికి గురజాడ పురస్కారం

ప్రముఖ సినీ నటుడు, రచయిత, దర్శకుడు అయిన తనికెళ్ళ భరణికి గురజాడ అప్పారావు పేరిట స్థాపించిన పురస్కారం లభించింది. ఈ అభినందన అందుకోటానికి తనికెళ్ళ భరణి సర్వవిధాలా అర్హుడని చాలా మంది ప్రముఖ రచయితలు అభిప్రాయపడుతున్నారు. నాటకరంగం నుండి సినీ పరిశ్రమకు వచ్చిన తనికెళ్ళ భరణి తను స్వయంగా వ్రాసి ప్రదర్శించిన "కొక్కొరొక్కో" ద్వారా అఖిలాంధ్రప్రేక్షకుల మన్ననలందుకున్నారు. తనికెళ్ళ భరణికి ఈ పురస్కారం లభించటం పట్ల సినీ పరిశ్రమలోని పలువురు ప్రముఖులు హర్షం వ్యక్తం చేస్తూ, తనికెళ్ళ భరణికి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా తెలుగువన్ తనికెళ్ళ భరణికి శుభాకామక్షలు తెలియజేస్తోంది.

సైక్ సిద్ధార్ధ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవేనా! పగ వాడికి కూడా ఆ బాధ రాకూడదు

శ్రీ నందు(Shree Nandu)చాలా గ్యాప్ తర్వాత సోలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటు 2026 కి వెల్ కమ్ చెప్తు నిన్న 'సైక్ సిద్దార్ధ'(Psych Siddhartha)తో సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. పక్కా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కగా బాగానే ఉందనే టాక్ ని సొంతం చేసుకుంది.  రివ్యూస్ కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. పైగా సింగల్ స్క్రీన్స్ తో సహా మల్టి ప్లెక్స్ లో టికెట్ రేట్స్ ని భారీగా తగ్గించారు. దీంతో అందరి చూపు సైక్ సిద్దార్ధ వైపు పడిందనే టాక్ సినీ సర్కిల్స్ లో వినిపిస్తుంది. మరి మొదటి రోజు ఏ మేర కలెక్షన్స్ ని రాబట్టిందో చూద్దాం.