English | Telugu

దాసరికి రామ్ చరణ్ కౌంటర్

దాసరికి రామ్ చరణ్ కౌంటర్ ఇచ్చాడని సినీ వర్గాలంటున్నాయి. వివరాల్లోకి వెళితే ఇటీవల దర్శకరత్న, డాక్టర్ దాసరి నారాయణరావుకి మన ముఖ్యమంత్రి యన్.కిరణ్ కుమార్ రెడ్డి చేతుల మీదుగా యస్.వి.రంగారావు స్మారక అవార్డు లభించింది. ఆ సందర్భంగా మాట్లాడుతూ " నేడు హీరోల డామినేషన్ ఎక్కువయ్యింది. ఒక్క కుప్పిగంతుల డ్యాన్స్ వస్తే చాలు. నటన రాకపోయినా ఫరవా లేదు. డైలాగ్ చెప్పటం రాకపోయినా బాధలేదు హీరోలుగా చెలామణీ అయిపోతున్నారు... ఇండస్ట్రీని భ్రష్టు పట్టిస్తున్నారు. ఈ పరిస్థితి మారాలి.." అంటూ దాసరి ప్రసంగించారు.

ఈ మాటలు ఆయన ఎవర్ని ఉద్దేశించి అన్నారో అందరికీ ఇట్టే అర్థమయ్యే విషయమే. దానికి కౌంటర్ గా యువ హీరో రామ్ చరణ్ మాట్లాడుతూ " ఈ సో కాల్డ్ గ్రేట్ డైరెక్టర్లంతా స్టేజీలెక్కి ఊక దంపుడు ఉపన్యాసాలివ్వటానికి తప్ప ఇంకెందుకూ పనికిరారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఒక హిట్ సినిమా తీయమనండి. వాళ్ళ వల్లకాదు. ఇలా నోటికి వచ్చినట్లు విమర్శించటం తప్ప వాళ్ళేమీ చేయలేరు" అని అన్నారు.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.