English | Telugu

శ్రీలంకలో తమన్నాతో రామ్ చరణ్ రచ్చ

శ్రీలంకలో తమన్నాతో రామ్ చరణ్ "రచ్చ" చేయనున్నాడని విశ్వసనీయవర్గాల ద్వారా అందిన సమాచారం. వివరాల్లోకి వెళితే మెగా సూపర్ గుడ్ ఫిలింస్ పతాకంపై, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తేజ హీరోగా, మిల్కీవైట్ బ్యూటీ తమన్నా భాటియా హీరోయిన్ గా, "ఏమైందీ ఈ వేళ" ఫేం సంపత్ నంది దర్శకత్వంలో, యన్.వి.ప్రసాద్, పరాస్ జైన్ సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమా "రచ్చ". ఈ రామ్ చరణ్ "రచ్చ" సినిమా షూటింగ్ హైదరాబాద్ లో ప్రారంభమై ఓ అయిదు రోజుల పాటు జరిగింది. ఈ 5 రోజుల్లో కొన్ని యాక్షన్ సీన్స్, హీరో రామ్ చరణ్ తేజ, బ్రహ్మానందంల మధ్య జరిగే కొన్ని హాస్యసన్నివేశాలనూ చిత్రీకరించారు.

జూలై మూడవ తేదీ నుండి రామ్ చరణ్ "రచ్చ" సినిమా షూటింగ్ శ్రీలంకలో జరుగనుంది. ఈ స్కెడ్యూల్లో హీరో రామ్ చరణ్ తేజ, హీరోయిన్ తమన్నా భాటియాలపై ఒక పాటను శ్రీలంకలో చిత్రీకరించనున్నారు. చిన్న సినిమా చేసిన సంపత్ నంది రామ్ చరణ్ ఇమేజ్ కి తగ్గ సినిమా తీయగలడా...? అని అనుమానాన్ని కొందరు సినీ ప్రముఖులు వ్యక్తపరిచారు. కానీ వారికి అనుమానానికి ఈ 5 రోజుల పాటు సంపత్ నంది ఈ రామ్ చరణ్ "రచ్చ" సినిమాని చిత్రీకరించిన విధానం సమాధానం చెప్పింది. ఈ రామ్ చరణ్ "రచ్చ" సినిమాకి సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీని నిర్వహిస్తూండగా, కేదార్ పరిమి పాటలనూ, పరుచూరి బ్రదర్స్ మాటలనూ, మణిశర్మ సంగీతాన్ని అందిస్తున్నారు.

ఇండియన్ సినిమా హిస్టరీలో ఇలాంటి సినిమా రాలేదు.. మారుతి ఏమంటున్నాడు

రెబల్ సాబ్ ప్రభాస్(Prabhas)పాన్ ఇండియా సిల్వర్ స్క్రీన్ పై తన కట్ అవుట్ కి ఉన్న క్యాపబిలిటీని రాజాసాబ్(The Raja saab)తో మరోసారి చాటి చెప్పాడు. ఇందుకు సాక్ష్యం రాజాసాబ్ తో తొలి రోజు 112 కోట్ల గ్రాస్ ని రాబట్టడమే.  ఈ మేరకు  మేకర్స్ కూడా ఈ విషయాన్ని అధికారకంగా ప్రకటిస్తూ పోస్టర్ ని కూడా రిలీజ్ చేసారు. దీంతో ప్రభాస్ అభిమానుల ఆనందానికి అయితే అవధులు లేవు. చిత్ర బృందం ఈ రోజు రాజా సాబ్ కి సంబంధించిన విజయోత్సవ వేడుకలు నిర్వహించింది. దర్శకుడు మారుతీ తో పాటు, నిర్మాత విశ్వప్రసాద్(TG Vishwa Prasad)రాజా సాబ్ హీరోయిన్స్ నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్ హాజరయ్యారు.

రాజాసాబ్ సర్కస్ 1935 .. సీక్వెల్ కథ ఇదేనా! 

పాన్ ఇండియా ప్రభాస్(Prabhas)అభిమానులు,ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రెబల్ మూవీ 'ది రాజాసాబ్'(The Raja saab)నిన్న బెనిఫిట్ షోస్ తో థియేటర్స్ లో ల్యాండ్ అయ్యింది. దీంతో థియేటర్స్ అన్ని హౌస్ ఫుల్ బోర్డ్స్ తో కళకళలాడుతున్నాయి. సుదీర్ఘ కాలం తర్వాత సిల్వర్ స్క్రీన్ పై వింటేజ్ ప్రభాస్ కనిపించడంతో ఫ్యాన్స్ ఆనందానికి అయితే అవధులు లేవు. రిజల్ట్ విషయంలో మాత్రం మిక్స్డ్ టాక్ వినపడుతుంది. రివ్యూస్ కూడా అదే స్థాయిలో  వస్తున్నాయి. కాకపోతే తెలుగు సినిమా ఆనవాయితీ ప్రకారం ఈ రోజు సెకండ్ షో కంప్లీట్ అయిన తర్వాత గాని అసలైన టాక్ బయటకి రాదు.