English | Telugu

బాలీవుడ్ కి సమంత....?

బాలీవుడ్ కి సమంత వెళుతుందని ఈ మధ్య ఫిలిం నగర్ లో ఒక పుకారు షికారు చేసింది. బాలీవుడ్ కి చెందిన రోహిత్ షెట్టి దర్శకత్వంలో రాబోయే "బోల్ బచ్చన్" అనే సినిమాలో సమంత నటించబోతోందనీ, ఈ పని మీద ఆమె ముంబాయి కూడా వెళ్ళిందనీ ఫిలిం నగర్ వర్గాలంటున్నాయి. కానీ ఇది నిజం కాదనీ, తాను ప్రస్తుతం తెలుగు, తమిళ సినిమాలతో చాలా బిజీగా ఉన్నాననీ, ప్రస్తుతం బాలీవుడ్ సినిమాల్లో నటించే ఉద్దేశం తనకు లేదనీ స్వయంగా సమంతే మీడియాకు తెలిపింది.

ప్రస్తుతం మహేష్ బాబు సరసన, శ్రీనువైట్ల దర్శకత్వంలో, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనీల్ సుంకర నిర్మిస్తున్న "దూకుడు" సినిమాలో సమంత హీరోయిన్ గా నటిస్తూంది. అలాగే రాజమౌళి దర్శకత్వంలో, నాని హీరోగా, సుదీప్ విలన్ గా నటిస్తున్న విభిన్నమైన సినిమా "ఈగ" లో కూడా సమంత హీరోయిన్ గా నటిస్తూంది.

రాజాసాబ్ సర్కస్ 1935 .. సీక్వెల్ కథ ఇదేనా! 

పాన్ ఇండియా ప్రభాస్(Prabhas)అభిమానులు,ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రెబల్ మూవీ 'ది రాజాసాబ్'(The Raja saab)నిన్న బెనిఫిట్ షోస్ తో థియేటర్స్ లో ల్యాండ్ అయ్యింది. దీంతో థియేటర్స్ అన్ని హౌస్ ఫుల్ బోర్డ్స్ తో కళకళలాడుతున్నాయి. సుదీర్ఘ కాలం తర్వాత సిల్వర్ స్క్రీన్ పై వింటేజ్ ప్రభాస్ కనిపించడంతో ఫ్యాన్స్ ఆనందానికి అయితే అవధులు లేవు. రిజల్ట్ విషయంలో మాత్రం మిక్స్డ్ టాక్ వినపడుతుంది. రివ్యూస్ కూడా అదే స్థాయిలో  వస్తున్నాయి. కాకపోతే తెలుగు సినిమా ఆనవాయితీ ప్రకారం ఈ రోజు సెకండ్ షో కంప్లీట్ అయిన తర్వాత గాని అసలైన టాక్ బయటకి రాదు.